Skip to content
ఎడిట్ పేజి వార్తలు

తెలంగాణ పోరాటంలో ఆయుధం పట్టిన సాహిత్యం

Prajapaksham 14 Sep 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
తెలంగాణ పోరాటంలో ఆయుధం పట్టిన సాహిత్యం

Literature that Took Up Arms in the Telangana Struggle

తెలంగాణ సాయుధ పోరాటానికి అనేకానేక కారణా ఉన్నాయి. అదే విధంగా కమ్యూనిజం నుంచి జానపదాల వరకూ ఎన్నో అంశాలు పోరాటానికి ఊపిరి పోశాయి. సాహిత్యం పోషించిన పాత్ర అద్వితీయం. అందుకే, తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేవలం తుపాకులు పట్టిన రైతుల తిరుగుబాటుగా అర్థం చేసుకుంటే దాని చరిత్రలోని ఒక ముఖ్యమైన పార్శ్వా కో అవుతుంది. 1946 నుంచి 1951 వరకు సాగిన ఈ పోరాటం భూమి, భుక్తి, విముక్తి కోసం రైతాం సా గించిన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఉద్య నిజాం నిరంకుశ పాలన, దేశ్‌ముఖ్‌లు, జమీందార్ల దోపిడీ, వెట్టి చాకిరీ, అధిక పన్నులు, భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా గ్రామీణ తెలంగాణ తిరుగుబాటు చే సింది. కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ ఈ అసంతృప్తికి రాజకీయ రూపాన్ని ఇచ్చాయి. ఆ పోరాటానికి సాహిత్యం ప్రజల భాషలో స్వరమిచ్చింది. అవసరమైన బలాన్ని అందించింది. ఉద్యమ నెగడులు రాజేసింది. పోరాట స్ఫూర్తిని రగిలించింది. అక్షరాస్యత పరిమితంగా ఉన్న గ్రామీణ సమాజంలో పుస్తకం కంటే పాట వేగంగా ప్రయాణిస్తుంది. వార్తాపత్రిక చదవని రైతు కూడా పాట వింటాడు. సభకు వెళ్లని మహిళ కూడా బుర్రకథ వింటుంది. అక్షరం తెలియని కూలీ కూడా జానపద గేయాన్ని గుర్తుంచుకుంటాడు. అందుకే తెలంగాణ సాయుధ పోరాటంలో సాహిత్యం ఒక అలంకారంగా కాకుండా, ప్రజా సమీకరణానికి పనిచేసిన రాజకీయ సాధనంగా ఉపయోగపడింది. ఆ కాలంలో వందలాది పాటలు, కథలు పుట్టాయి. కొన్ని నాటకాలు, నవలలు కూడా వెలువడ్డాయి. పోరాటం సాగుతున్న సమయంలో దీర్ఘమైన నవల రాయడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాట, గేయం, కథ, నాటకం వంటి తక్షణ ప్రసార రూపాలే ఎక్కువ ప్రభావం చూపా ఎన్నో విప్లవాల మాదిరిగానే తెలంగాణ సాయుధ పోరాటంలోనూ సాహిత్యం కీలక భూమిక పోషించింది. ఈ క్రమంలో వచ్చిన సాహిత్య ప్రత్యేకత దాని భాషలోనే ఉంది. అది గ్రంథాలయాల్లో మాత్రమే కనిపించే భాష కానేకాదు. గ్రామాల మాట.. రైతుల నుడికారం.. కూలీ ల అనుభవం.. దొరల దౌర్జన్యంపై నిరసన గళం.. వెట్టి చాకిరీ బాధను మోసిన అక్షర రూపం.. పోలీసు-రజాకార్ల హింసను కళ్లకు కట్టిన ఇవన్నీ పాటల్లోకి వచ్చాయి. అందువల్ల ఆ పాటలు ప్రజల సొంత అనుభవాలుగా మారాయి. సుద్దాల హనుమంతు, కాళోజీ నారాయణ రావు, దాశరధి రంగాచార్య, దాశరధి కృష్ణమాచార్య, వట్టికోట ఆళ్వార్‌స్వామి.. ఇలా ఎంతో మంది రచయితలు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పేరు కూడా ప్రకటించుకోని ఎంతో మంది జానపద రచయితలు రాసిన పాటలు వాడవాడలా మారుమోగాయి. ప్రజలకు స్ఫూర్తిమంత్రాలయ్యాయి. అలాంటి ప్రజా కవిత్వానికి సుద్దాల హనుమంతు అత్యంత ముఖ్యమైన ప్రతినిధి. ఆయన అసాధారణ కవి. పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాంస్కృతిక కార్యకర్త. ఆయన పాటలు వెట్టి చాకిరీ, దోపిడీ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచాయి. ‘పల్లెటూరి పిల్లగాడా…’ వంటి పాటలు గ్రామీణ తెలంగాణలో అపారమైన ప్రజాదరణ పొందాయి. ‘వేయ్‌ వేయ్‌.. దెబ్బకు దెబ్బ’ వంటి గేయాలు పోరాటానికి ప్రతిఘటన స్వరాన్ని ఇచ్చాయి. హనుమంతు పాటలపై జరిగిన పరిశోధనలు ఆయన గేయాలు అణగారిన వర్గాలను సమీకరించడంలో కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో బండి యాదగిరి వంటి ప్రజా కవులు పుస్తక రచయితలుగా కాకుండా, ప్రజల మధ్య పాడే కవులుగా చరిత్రలో నిలిచారు. ‘బండెనక బండి కట్టి…’ అనే గేయం తెలంగాణ సాయుధ పోరాటపు సామూహిక జ్ఞాపకంలో ప్రత్యేక స్థానం సం ఈ పాటలో రైతు ప్రపంచం, దోపిడీపై ఆగ్ర దొరలపై తిరుగుబాటు అన్నీ ఒకేసారి వినిపిస్తా బండి యాదగిరి వంటి కవులు ప్రజల కోసం పాటలు రాయకుండా, ప్రజల మధ్య నుంచే పాటను సృ ష్టించారు. ఇలాంటి పాటలకు రచయిత పేరు ఉండటం కూడా అవసరం లేని పరిస్థితి. కొన్ని పాటలు ఒకరి దగ్గర పుట్టి మరొకరి గొంతులో మారాయి. గ్రామం నుంచి గ్రామానికి వెళ్లే కొద్దీ పదాలు మారాయి, బాణీ మారింది, సందర్భం మారింది. చివరకు ఆ పాట వ్యక్తిగత రచనగా కాకుండా ప్రజల సామూహిక సృష్టిగా మారింది. తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ మౌఖిక సాహిత్య సంప్రదాయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
ఇక తెలంగాణ సాయుధ పోరాట కాలపు ప్రముఖ కవు ఒకరైన దాశరథి కృష్ణమాచార్య కవిత్వంలో నిజాం పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. 1947లో ఆయన అరెస్టయ్యాడు. వరంగల్‌, నిజామాబాద్‌ జైళ్లలో నిర్బంధాన్ని అనుభవించాడు. జైలు జీవితంలోనూ ఆయన కవిత్వం ఆగలేదు. ఆ అనుభవాలే తరువాత ఆయన విప్ల వ కవిత్వానికి పదును పెట్టాయి. ఆయన తొలి ప్రముఖ కృతి అగ్నిధారలో తెలంగాణ ‘పోరాటపు అగ్ని’ స్పష్టంగా కనిపిస్తుంది. దాశరథి కవిత్వంలో తెలంగాణ భూమి ఒక భౌగోళిక ప్రాంతంగా మాత్రమేగాక, దోపిడీకి వ్యతిరేకంగా నిలిచిన ప్రజల ప్రతీకగా ఆవిష్కృతమవుతుంది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే భావప్రపంచం తరువాతి తరాలకు తెలంగాణను పరిపాలనా ప్రాంతం గా కాకుండా ఒక సాంస్కృతిక అస్తిత్వంగా చూడటానికి సహకరించింది. దాశరథి ప్రాముఖ్యత నిజాం వ్యతిరేక కవిత్వానికి పరిమితం కాలేదు. ఆయన కవిత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వ్యక్తం చేసింది. జైలు, ని దౌర్జ న్యం మధ్య కూడా కవి స్వరం కొనసాగుతుందనే నమ్మకాన్ని ఆయన రచనలు కలిగించాయి. ‘జనపదం’, ‘మోదుగుపూలు’ వంటి అద్భుత రచనలతో తెలంగాణలో దొరల దౌర్జన్యాలను కళ్లకు కట్టిన దా శరధి రంగాచార్య చేసిన సాహితీ సేవలు అద్వితీ యం. ప్రజల తరఫున మాట్లాడిన స్వరం కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రజా కవిత్వంలో మ రో విశిష్టమైన పేరు. ఆయనకు కవిత్వం ఒక సాహి త్య వ్యాయామం. సమాజంతో కవికి ఉండే నైతిక సంబంధం. నిజాం పాలనను, నిరంకుశత్వాన్ని, ఫా సిజాన్ని, సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించే తీవ్రమైన గళం. కాళోజీ తన రచనల్లో సాధారణ మనిషికి పట్టం కట్టాడు. ఆయన భాషలో పాండిత్య ప్రదర్శన కంటే సంభాషణా ధోరణి ఎక్కువ. అందువల్ల ఆయన కవిత్వం సభలో చదివే పద్యంగా కాకుండా ప్రజలతో మాట్లాడే మాటగా మారింది. ‘నా గొడవ’ అనే రచనలో ఈ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వం గురించి కూడా కాళోజీ చాలా ముందుగానే ఆలోచించాడు. ఆయన దృష్టి లో ప్రాంతీయ ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం, సా మాజిక న్యాయం పరస్పరం సంబంధం ఉన్న అం శాలు. అందుకే ఆయన తెలంగాణ సమాజపు రాజకీయ చైతన్యానికి ఆయన ఒక ప్రజా మేధావిగా గుర్తింపు పొందాడు. తెలంగాణ సాహిత్య చరిత్రలో వట్టికోట ఆళ్వారుస్వామి పాత్రను ప్రత్యేకంగా గుర్తించాలి. ఆయన రచయిత, పాత్రికేయుడు, ప్ర చురణకర్త, గ్రంథాలయ ఉద్యమకారుడు, రాజకీయ కార్యకర్త. నిజాం పాలనకు వ్యతిరేకంగా పనిచేసినందుకు జైలుకు వెళ్లాడు. జైలు లోపలలో ఆయన జైలు అనుభవాలను నమోదు చేశాడు. ‘ప్రజల మనిషి’లో తెలంగాణ సామాజిక వాస్తవికతను ప్రతిబింబించాడు. అంతకంటే ముఖ్యంగా దేశోద్ధారక గ్రంథమాల ద్వారా పుస్తకాలను సామాన్య ప్రజలకు చేరువ చేశాడు. సాహిత్యం అంటే చదువుకున్న వర్గం వినోదం కాదని, ప్రజలలో ఆలోచన పెంచే సాధనమని నమ్మాడు. ఆచరణలో చూపాడు. ఆయన ప్రచురణా కార్యక్రమం గ్రామీణ సమాజంలో పఠన సంస్కృతిని పెంచడంలో కీలకంగా పనిచేసింది. తెలంగాణ సా యుధ పోరాటానికి సాహిత్యం అందించిన మరో గొప్ప ఆయుధం పాట. ఎందుకంటే, ఒక పాట వెంటనే ప్రజలను కదిలిస్తుంది. ఒక పుస్తకం మాత్రం ఆలోచనను దీర్ఘకాలం నిలబెడుతుంది. పాట ప్రజలను సమీకరిస్తే, పుస్త ఆ సమీకరణానికి సిద్ధాంతపరమైన పునాది వేస్తుంది. ఆళ్వారుస్వామి ఈ రెండో పనిని చేశాడు.
సాహిత్యం పుస్తకంలోనే ఉండిపోతే తెలంగాణ సా యుధ పోరాటంలో దాని ప్రభావం ఇంతటి విస్తృతంగా ఉండేది కాదు. నాటకం, బుర్రకథ, గోల్లసుద్దులు, ఫకీర్‌, పిట్టలదొర, బైరాగులు వంటి స్థానిక జానపద కళారూపాలను రాజకీయ చైతన్యానికి ఉపయోగించారు. తెలంగా ణ ప్రజానాట్యమండలి సాంస్కృతిక బృందాలు గ్రామాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చాయి. సాయుధ పోరాటం తీవ్రమైన దశలో ఈ కళాకారులు గెరిల్లా దళాల రక్షణలో కూడా ప్రదర్శనలు నిర్వహించారు. ‘మా భూమి’ నాట కం ఈ సాంస్కృతిక ఉద్యమానికి ఒక ముఖ్యమైన ఉదాహరణ. సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రచించిన ఈ నాటకం భూమి, దోపిడీ, రైతాంగ జీవితం వంటి అంశాలను రంగస్థలంపైకి తెచ్చింది. 1947లోనే ఈ నాటకాన్ని అనేక బృందాలు విస్తృతంగా ప్రదర్శించాయి. తరువాత అది నిషేధానికి గురైంది. సాహిత్యం రాజకీయ అధికారాన్ని ఎందుకు కలవరపెడుతుందో మా భూమి చరిత్ర స్పష్టం చేస్తుంది. స్థూలంగా చూస్తే, తెలంగాణ సాయుధ పోరాటంలో సాహిత్యం మూడు ప్రధాన పనులు చేసింది. మొదటిది, బాధ కు పేరు పెట్టింది. వెట్టి చాకిరీ, దోపిడీ, భూస్వామ్య అణచివేత వంటి అనుభవాలను పాటగా మార్చినప్పుడు వ్యక్తిగత బాధ సామూహిక అనుభవంగా మారింది. రెండవది, భయాన్ని ప్రతిఘటనగా మార్చింది. దొరను, రజాకారును, అధికారాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పాటలు, బు ర్రకథలు, నాటకాలు ప్రజల్లో పెంచాయి. ఒక గ్రామంలో జరిగిన సంఘటన మరుసటి రోజే మరో గ్రామంలో పాటగా వినిపించేది. అలా సమాచారం, ఆగ్రహం, ధైర్యం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించాయి. మూడవది, పోరాటానికి జ్ఞాపకాన్ని నిర్మించింది. యుద్ధం ముగిసిన తరువాత కూడా పాటలు మిగిలాయి. పుస్తకాలు మిగిలాయి. కథలు మిగిలాయి. అం పోరాటం ఒక చారిత్రక తేదీల సమాహారంగా కా కుండా ప్రజల స్మృతిలో జీవించే అనుభవంగా మా రింది. ఈ విషయంలో మహిళా సాంస్కృతిక కార్యకర్తల పాత్రను కూడా విస్మరించలేం. బుర్రకథలు, నాటకాలు, పాటల ద్వారా మహిళలు కూడా రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. జైలు జీవితంలో ఉన్నప్పటికీ సాంస్కృతిక రచనలు చేసిన కార్యకర్తల ఉదాహరణలు కూడా ఉ న్నాయి. అంటే సాహిత్య-సాంస్కృతిక పోరాటం పురుష రచయితల పరిధిలోనే నిలవలేదు. తెలంగాణ సాహిత్య సంప్రదాయం 1946లో మొదలుకాలేదు. నన్నయకు పూర్వపు జైన సాహిత్యం నుంచి పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, మల్లినాథసూరి వరకు విస్తరించిన దీర్ఘమైన సాహిత్య పరంపర ఈ నేలపై ఉంది. కుతు షాహీ కాలంలో దక్కనీ ఉర్దూ వికసించింది. మహా లఖా బాయి చందా వంటి కవయిత్రులు హైదరాబాద్‌ సాంస్కృతిక ప్రపంచానికి విశిష్టమైన కృషి చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, దాశరథి, మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌, వట్టికోట ఆళ్వారుస్వా మి, బిరుదురాజు రామరాజు వంటి మేధావులు తెలంగాణ సాంస్కృతిక చైతన్యాన్ని విస్తరించారు. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక ద్వారా సాహిత్య, సామాజిక చర్చలకు వేదిక నిర్మించారు. ఆయన గోలకొండ కవుల సంచిక తెలంగాణలో కవిత్వం లేదనే అపోహకు సమాధానంగా నిలిచింది. మఖ్దూమ్‌ మొహియుద్దీన్‌ ఉర్దూ కవిత్వంలో విప్లవ భావజాలాన్ని, ప్రేమను, మానవతను కలిపిన కవి. ఆయన సాహిత్య ప్రభావం తెలంగాణ భా షా సరిహద్దులను దాటి విస్తరించింది. ఈ బహుభాషా సాహిత్య వాతావరణం కూడా తెలంగాణ సాయుధ పోరాట సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి అవసరం.

ట్యాగ్‌లు: editorial national Telangana