Skip to content
ప్రపంచం వార్తలు

Mount Elbrus: యూరప్ లోని మౌంట్ ఎల్ర్బస్ పై ‘త్రివర్ణపతాకం’ ఎగురవేసిన.. శివాని మెహ్రాత్రా

Prajapaksham 31 Aug 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Mount Elbrus: యూరప్ లోని మౌంట్ ఎల్ర్బస్ పై ‘త్రివర్ణపతాకం’ ఎగురవేసిన.. శివాని మెహ్రాత్రా

Mount Elbrus: ఆమె 43 ఏళ్ల పర్వతారోహకురాలు మాత్రమే కాదు. ఒక మహోన్నత స్ఫూర్తి శి ఖరం. ఓ 18ఏళ్ల కూతురుకు అన్నీ తానైన ఒక తల్లిగా, కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఒక గృహిణిగా, పర్వతారోహణ ఆశయాన్ని అసలే వీడని ఒక ఒక మహిళగా అ న్నీ ఏకకాలంలో కొనసాగిస్తున్న ధీర మహిళ. ఆ మె ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలలో కొన్నింటిపై తన పరిమితులను పరీక్షిస్తూనే ముందడుగు వేస్తున్న పర్వతారోహకురాలిగా ప్రశంసలందుకుంటున్న శివాని మెహోత్రా.

Mount Elbrus: ఆమె 43 ఏళ్ల పర్వతారోహకురాలు మాత్రమే కాదు. ఒక మహోన్నత స్ఫూర్తి శి ఖరం. ఓ 18ఏళ్ల కూతురుకు అన్నీ తానైన ఒక తల్లిగా, కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఒక గృహిణిగా, పర్వతారోహణ ఆశయాన్ని అసలే వీడని ఒక ఒక మహిళగా అ న్నీ ఏకకాలంలో కొనసాగిస్తున్న ధీర మహిళ. ఆ మె ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరాలలో కొన్నింటిపై తన పరిమితులను పరీక్షిస్తూనే ముందడుగు వేస్తున్న పర్వతారోహకురాలిగా ప్రశంసలందుకుంటున్న శివాని మెహోత్రా.

ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాకు చెందిన మె హోత్రా 24ఏళ్ల వయసులోనే లక్నోలో వివా హం చేసుకుంది. ప్రస్తుతం ఈమె తన కుటుం బంతో ముంబైలో నివసిస్తున్నారు. మెహ్రాత్రా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని యూరప్ లోనే ఎత్తైన శిఖరమైన రష్యాలోని మౌంట్ ఎల్రస్ పైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుక లు జరుపుకున్నారు. రష్యా నుంచి భారత్కు తిరి గివస్తున్న సమయంలో ఆమె ‘పిటిఐ’తో ఫోన్లో మాట్లాడారు.

ఆగస్టు 15న జరిగిన శిఖరాగ్ర ప్ర యాణం తనకు ఒక శారీరక ఓర్పుతోపాటు మా నసిక బలానికి కూడా ఒక పరీక్ష అని మె హోత్రా తన అనుభవాలను పంచుకున్నారు. ‘వ యస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నేనెప్పుడూ నమ్ముతాను’ అని ఆమె అన్నారు. ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో వయస్సు కన్నా పట్టుదల, క్షమశిక్షణే ముఖ్యమని శివాని మెహ్రాత్రా నొక్కిచెప్పారు.

మెహ్రాత్మాకు ఈ ప్రయాణంలో తన ఆశయాలను భార్యగా, తల్లి గా తన బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం ఇమిడి ఉంది. పర్వతారోహణను ఒక వృత్తిగా చేపట్టమని తనను ప్రోత్సహించనందుకు ఆమె తన తల్లిదండ్రులకు, భర్తకు, కుమార్తెకు, స్నేహి తులకు కృతజ్ఞతలు తెలిపింది.

ట్రెక్కింగ్, పర్వ తారోహణ చేసే మహిళలు చాలా తక్కువ సం ఖ్యలో ఉన్నారని, ముఖ్యంగా, ‘పర్వతాలపై 40 ఏళ్లు పైబడిన మహిళలను నేను చాలా అరుదు గా చూస్తాను’ అని శివాని మెహ్రాత్రా చెప్పారు. ‘నా కుటుంబం ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ, ఇది చేయడానికి నాకు ధైర్యాన్నిచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానిస్తూ, నా అతి పెద్ద యాత్రకు నా సొంత పొదుపుతో నిధులు సమకూర్చుకోవడా నికి ప్రయత్నిస్తున్నాను’ అని శివాని మెహ్రాత్రా వివరించారు.

2019లో తన ప్రాణ స్నేహితురా లితో కలిసి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కిం గక్కు వెళ్లాలని పణాళిక వేయడంతో ఆమెకు పర్వతారోహణపై మక్కువ పెరిగింది. ఒకే ఒక్క ట్రెక్కింగ్ ప్రణాళికతో ప్రారంభమైనది త్వరలోనే ఒక అభిరుచిగా మారి, ఆమెను హిమాలయ లలో భాగంగా ఉన్నటువంటి కాశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్ సహా అనేక ఇతర ప్రాంతా లకు తీసుకెళ్లింది.

కొవిడ్ -19 మహమ్మారి సమయంలో మెహ్రాత్రా అభిరుచి యోగా వైపు మళ్లి, ఆ తర్వాత ఉన్నత స్థాయి యోగా అభ్యాస కురాలిగా, థెరపిస్ట్గా శిక్షణ పొందారు. అంతే కాకుండా, శివాని మెహ్రాత్రా ఆరు సంవత్సరా లుగా యోగా బోధిస్తున్నారు. ఇందులో ప్రసవా నికి ముందు, ప్రసవం తర్వాత మహిళలకు, అలాగే కేన్సర్ రోగులకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి.

ఆమె ప్రతీరోజూ ఉదయం 3 -30గంటలకే నిద్రలేచి, యోగా, జిమ్ వర్కౌట్లు, పరుగు, ట్రెక్కింగ్ సన్నాహాలు చేస్తూ, కఠినమైన ఫిట్ నెస్, ఆహార నియమాలను పాటి స్తోంది. ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ కోసం సిద్ధ మవుతున్న ఆమె తన తదుపరి లక్ష్యాలలో నేపా ల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలని అనుకుంది. ‘ఎవరెస్ట్ నా ప్రధాన లక్ష్యం. నేను దానిని సాధించాల్సిందే’ అని శివాని మెహ్రాత్రా నొక్కి చెప్పారు.

ట్యాగ్‌లు: World News