అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. లండన్ నుంచే హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy’s Key Message at Tungabhadra Brings New Hope for Farmers of Three States
తెలంగాణ సీఎం ఎ. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. రాజకీయ కారణాలతో క్లియరెన్స్ ఇవ్వలేమని విదేశాంగ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అమెరికా పర్యటనలో బోస్టన్, న్యూయార్క్ తదితర ప్రాంతాల్లో పర్యటించి హార్వర్డ్, MIT, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.అయితే కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లకుండా ఆగస్టు 23న లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
అమెరికా పర్యటనను అధికారులు కొనసాగించాలని, ఆయా విద్యాసంస్థలతో MoUs, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.విద్య, నైపుణ్యాలు, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.
లండన్‌లో సీఎం తన షెడ్యూల్ ప్రకారం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అలాగే బ్రిటన్‌లోని ప్రముఖ క్రీడా, నైపుణ్యాభివృద్ధి సంస్థలతోనూ చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్యాలకు ప్రయత్నించనున్నారు.
“తెలంగాణRising ఆగదు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ ప్రగతి రాజకీయాల కంటే ఎంతో ముఖ్యమైనవి” అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
- Independence Day 2026: ఆగస్టు 15, 1947న గాంధీజీ ఎక్కడ ఉన్నారు.. తొలి స్వాతంత్ర్య వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారు..
- అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. లండన్ నుంచే హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి
- ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో జగమే సంగీతం
- ‘మనసా వాచా’ ఆనంద్ దేవరకొండ
- అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా ‘మహాకాళి’