భగ్గమంటున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నింగిని తాకిన రేట్లు.. ఈ రోజు రేట్లు ఇవిగో..
Gold Rates Today
అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై వడ్డీ రేట్ల అంచనాల ప్రభావంతో వరుసగా మూడో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పసిడి రెండు నెలలకు పైగా గరిష్ఠ స్థాయికి చేరుకోగా.. స్థానిక మార్కెట్లలోనూ 10 గ్రాముల బంగారంపై వెయ్యి రూపాయిలకు పైగా ధర పెరిగి రికార్డు నమోదు చేసింది. త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు దూసుకెళ్లడం పసిడి ప్రియులు, కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
దేశీయ మార్కెట్‌లో బుధవారం నాటి రేట్లను పరిశీలిస్తే.. 24 క్యారట్ల బంగారం గ్రాముకు రూ.104 పెరిగి రూ.15,486 వద్ద నమోదు కాగా, 22 క్యారట్ల బంగారం గ్రాము రూ.95 పెరిగి రూ.14,195 తాకింది. ఇక 18 క్యారట్ల బంగారం గ్రాము రూ.77 పెరిగి రూ.11,614 వద్ద స్థిరపడింది. బల్క్ కొనుగోళ్లలో 100 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.10,400 పెరిగి రూ.15,48,600 పలకగా, 22 క్యారట్లు రూ.14,19,500 వద్ద, 18 క్యారట్ల బంగారం రూ.11,61,400 వద్ద నమోదు కావడం గమనార్హం.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1,54,860 కి చేరింది. ఈ నగరాల్లో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.950 పెరుగుదలతో రూ.1,41,950 కాగా, 18 క్యారట్ల బంగారం రూ.1,16,140 వద్ద నమోదైంది.
మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,010 పలకగా, 22 క్యారట్ల ధర రూ.1,42,100, 18 క్యారట్ల బంగారం రూ.1,16,290గా ఉంది. చెన్నైలో 24 క్యారట్ల ధర రూ.1,54,910, 22 క్యారట్లు రూ.1,42,000, 18 క్యారట్లు రూ.1,19,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అహ్మదాబాద్‌లో 24 క్యారట్లు రూ.1,54,910, 22 క్యారట్లు రూ.1,42,000 మరియు 18 క్యారట్ల ధర రూ.1,16,190 వద్ద కొనసాగుతోంది.
- హార్ముజ్ జలసంధిపై ముంచుకొస్తున్న ముప్పు .. చర్చలపై ఇరాన్ కీలక ప్రకటన..
- Trump Towers: హైదరాబాద్లో ట్రంప్ టవర్స్.. ఒక్క ఫ్లాట్ ఖరీదు ఎంతో తెలుసా.. రూ. 2 వేల కోట్లు పెడితే రూ. 4 వేల కోట్లు జేబులోకి..
- N Chandrasekaran Salary: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ జీతం ఎంతో తెలుసా? ఐదేళ్ల మొత్తం సంపాదన ఎంత.. కొత్త ఛైర్మన్ ఎంపిక విధానం ఎలా ఉంటుంది..
- Independence Day Speech: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. ఆగస్టు 15 నాడు చిన్న పిల్లల సులభంగా ప్రసంగించేలా ప్రత్యేక వ్యాసం
- Independence Day Speech in Telugu: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం తెలుగులో.. కళాశాలలు లేదా వేదికలపై మాట్లాడటానికి చక్కటి ప్రసంగం ఇదిగో..