Baba Vanga 2026 Predictions: బాబా వంగా జోస్యం.. 2026లో ఏం జరగబోతోంది? ఏలియన్స్‌తో మానవుల తొలి పరిచయం.. పుతిన్‌కు పదవీ గండం..
Baba Vanga 2026 Predictions
Baba Vanga 2026 Predictions: బల్గేరియన్ నోస్టర్‌డామస్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అంధ కాలజ్ఞాని బాబా వంగా (Baba Vanga) చేసిన జోస్యాలకు అంతర్జాతీయంగా భారీ ఫాలోయింగ్ ఉంది. గతంలో సెప్టెంబర్ 11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం, కోవిడ్-19 మహమ్మారి వంటి అనేక కీలక పరిణామాలను ఆమె ముందుగానే ఊహించారని ఆమె అనుచరులు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలోనే 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె చెప్పిన మూడు ప్రధాన భవిష్యవాణులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
2026పై బాబా వంగా ప్రధాన అంచనాలు:
- భారీ అంతరిక్ష నౌక రాక (ఏలియన్లతో మొదటి సంప్రదింపు):
ఆమె అనుచరుల కథనం ప్రకారం.. 2026 నవంబర్ నాటికి ఒక భారీ అంతరిక్ష నౌక భూమిపైకి వస్తుంది. ఇది మానవాళికి, గ్రహాంతర వాసులకు (Aliens) మధ్య జరిగే మొదటి అధికారిక సంప్రదింపులకు వేదికవుతుంది. అయితే, ఆ జీవులు శాంతియుతంగా వస్తాయా లేదా మానవాళికి ముప్పుగా మారతాయా అనే అంశంపై స్పష్టత లేదు.
- మూడవ ప్రపంచ యుద్ధం భయం:
2026లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చైనా-తైవాన్ ఉద్రిక్తతలు, రష్యా-అమెరికా మధ్య ప్రాక్సీ యుద్ధం, పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ భీకర యుద్ధ వాతావరణం ఈ జోస్యానికి సంకేతాలని ఆమె ఫాలోవర్స్ భావిస్తున్నారు.
- పుతిన్ అధికారం కోల్పోవడం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2027 నాటికి అధికార పీఠం నుంచి తప్పుకుంటారని, ఆయన స్థానంలో కొత్త నాయకుడు వస్తాడని మరో సంచలన ప్రచారం ఉంది. ప్రస్తుతం రష్యాపై పుతిన్‌కున్న పట్టు చూస్తే ఇది అసాధ్యమనిపించినా, ఆయన ఆరోగ్యంపై వస్తున్న రకరకాల వార్తలు ఈ జోస్యానికి బలం చేకూరుస్తున్నాయి.
పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాలు:
గత కొంతకాలంగా పుతిన్ క్యాన్సర్ లేదా పార్కిన్సన్స్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, పలు శస్త్రచికిత్సలు చేయించుకున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. బహిరంగ సమావేశాల్లో ఆయన చేతులు వణకడం, టేబుల్‌ను గట్టిగా పట్టుకోవడం వంటివి వైరల్ అయ్యాయి. అయితే, రష్యా ప్రభుత్వం (క్రెమ్లిన్) ఈ వార్తలన్నింటినీ ఖండిస్తూ, పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేస్తోంది.
ఆరోగ్య కారణాలతో లేదా రాజకీయాందోళనల వల్ల పుతిన్ తప్పుకుంటేనే ఈ జోస్యం నిజమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రిడిక్షన్స్‌లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే రాబోయే నెలల పరిణామాలను వేచి చూడాల్సిందే!
- హతమారుస్తామని ఇరాన్ బెదిరింపులు.. హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపించిన ట్రంప్ సీక్రెట్ ఎస్కేప్
- YouTube: యూట్యూబ్‌లో కొత్త క్రియేటర్లకు మానిటైజేషన్ కష్టమే.. వాచ్ అవర్స్ టార్గెట్ రెట్టింపు
- Prakash Raj: బెంగళూరులో ఓటు గల్లంతుపై ప్రకాశ్ రాజ్ ఫైర్.. సెల్ఫీ వీడియోలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
- Baba Vanga 2026 Predictions: బాబా వంగా జోస్యం.. 2026లో ఏం జరగబోతోంది? ఏలియన్స్‌తో మానవుల తొలి పరిచయం.. పుతిన్‌కు పదవీ గండం..
- Colombia Earthquake: కొలంబియాలో భారీ భూకంపం..169కు చేరిన మృతుల సంఖ్య.. మరింతగా పెరిగే అవకాశం