Telangana Politics: మొక్కే కదా అని పీకేద్దాం అనుకుంటే పీక కోస్తాం.. కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్ట్రాంగ్ వార్నింగ్..
Kunamneni Sambasiva Rao
తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే Kunamneni Sambasiva Rao అధికార కాంగ్రెస్ పార్టీకి ఘాటు హెచ్చరిక జారీ చేశారు. కూటమి భాగస్వామిగా ఉన్న సీపీఐని తక్కువ అంచనా వేయడం “మీ శవపేటికను మీరే నిర్మించుకున్నట్టే” అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీపీఐతో ఉన్న పొత్తు ధర్మాన్ని గౌరవించాలని, లేకపోతే గతంలో బీఆర్ఎస్ ఎదుర్కొన్న రాజకీయ పరిణామాలనే కాంగ్రెస్ కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పినపాక నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో…
Telangana Politics: తెలంగాణలో అధికారంలో ఉన్న మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కూనంనేని, తమ పార్టీ స్నేహధర్మానికి కట్టుబడి ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. కమ్యూనిస్టులను అవమానిస్తే ఏమాత్రం ఊరుకునేది లేదు. మేము కాంగ్రెస్‌తో పొత్తుకు కట్టుబడి ఉన్నాం. ఒకవేళ మమ్మల్ని వీడిపోవాలని చూస్తే మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరు. అది మీ శిలాఫలకాన్ని మీరే పెట్టుకున్నట్టు, మీ శవపేటికను మీరే తయారు చేసుకున్నట్టు అవుతుందని తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.
కమ్యూనిస్టుల బలాన్ని తక్కువ చేసి చూడవద్దని కాంగ్రెస్ నాయకత్వానికి కూనంనేని హెచ్చరికలు జారీ చేశారు. కమ్యూనిస్టులతో ఏమవుతుంది లే, వీళ్లు చిన్న చిన్న మొక్కలే కదా అనుకుంటే పీక కోస్తాం. వీళ్లు కేవలం పది మందే ఉన్నారు అని తక్కువ అంచనా వేస్తే ఆ పదిమందితోనే మీ సంగతి ఏంటో తేలుస్తాం” అని స్పష్టం చేశారు.
బీజేపీ వంటి మతతత్వ శక్తులు రాష్ట్రంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచామని, అయితే తమ సీనియారిటీని, పార్టీ బలాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్-సీపీఐ పొత్తుల ధర్మంపై స్థాయిలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో కూనంనేని చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు కూటమి రాజకీయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
- లఖింపూర్ హింసాకాండ కేసులో.. ఆశిష్ మిశ్రా బెయిల్ షరతుల సడలింపునకు ‘సుప్రీం’ నో
- తెహెల్కా పత్రిక మాజీ సంపాదకుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష… బాంబే హైకోర్టు తీర్పు
- వర్షాల కోసం తెలంగాణలో వరుణయాగం.. ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో ముహూర్తం ఫిక్స్
- Rahul Gandhi: బీజేపీ సర్కార్ నన్ను అడ్డుకోలేదు..’ఛాత్రోన్ కీ గూంజ్’ అనుమతి రద్దుపై రాహుల్ మండిపాటు
- పార్టీ విరాళాల స్వీకరణలో డీఎంకే టాప్…రూ. 140 కోట్లతో వైసీపీ 3వ స్థానం..టీడీపీది 4వ స్థానం