Bypoll Results 2026: గుజరాత్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు.. మంజల్పూర్లో వికసించిన కమలం, దతియాను హస్తగతం చేసుకున్న కాంగ్రెస్..
BJP VS Congress
Bypoll Results 2026: దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా సాగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గుజరాత్‌లోని మంజల్పూర్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిలబెట్టుకోగా.. మధ్యప్రదేశ్‌లోని దతియా స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గుజరాత్‌లోని వడోదర జిల్లా మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సతీశ్ పటేల్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రబారీపై 30,630 ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు.
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం సతీశ్ పటేల్‌కు 55,481 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రబారీకి 24,851 ఓట్లు లభించాయి. 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే నాటికే బీజేపీ విజయం ఖరారైంది.
సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి యోగేశ్ పటేల్ జూన్ 2న మరణించడంతో ఈ స్థానానికి జూలై 30న ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే పోటీలో నిలిచాయి. ఈ విజయంతో 182 సభ్యుల గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ బలం 162కు పెరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 12 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీకి 5 స్థానాలు ఉన్నాయి.
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి కున్వర్ ఘనశ్యామ్ సింగ్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6,016 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఘనశ్యామ్ సింగ్‌కు 66,757 ఓట్లు లభించగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికలో ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థి దామోదర్ యాదవ్ కూడా దాదాపు 22 వేల ఓట్లు సాధించి గణనీయమైన ప్రభావం చూపారు.
- Harish Rao Farm House: అజీజ్‌నగర్ భూములపై కాంగ్రెస్ ఫీల్డ్ విజిట్.. కేటీఆర్, హరీశ్‌రావుపై చామల ప్రశ్నల వర్షం
- Harish Rao Farmhouse: అసైన్డ్ భూముల్లో ఫాం హౌస్ నిర్మించారు..అద్దంకి ఫైర్..హరీష్ రావు ఫాం హౌస్ భూముల్లో కాంగ్రెస్ నేతల ఫీల్డ్ విజిట్..
- Telangana Land Resurvey: భూముల రీ-సర్వేపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు.. భూముల సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
- TIMS Hospital Theft: సనత్ నగర్ TIMS ఆసుపత్రిలో భారీ చోరీ.. 288 వైద్య పరికరాలు మాయం, సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు
- Singareni Workers Land Issue: సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. భూముల సమస్యపై ప్రభుత్వం కీలక నిర్ణయం, 45 రోజుల్లో పరిష్కారం