Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Drinking Water After Fruits: ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగడం చాలా డేంజర్.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

Prajapaksham 14 Jul 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Drinking Water After Fruits: ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగడం చాలా డేంజర్.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

Drinking Water After Fruits: ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగడం చాలా డేంజర్.. వైద్య నిపుణులు ఏమని చెబుతున్నారో తెలుసుకోండి..

Drinking Water After Fruits: మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి తగినంత నీరు అందించడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు చెబుతుంటారు. నీరు మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంతో పాటు అవయవాలను ఎంతో తేమగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మ, జుట్టు ఆరోగ్యానికి చాలా సహాయకారిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నీరు తాగే విషయంలో సమయం, పద్ధతి కూడా అంతే కీలకం. ముఖ్యంగా భోజనం చేసిన వెంటనే లేదా పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పండ్లు సహజంగానే రసభరితంగా ఉండి, వాటిలో ఇప్పటికే అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ శ్వేతా మహాదిక్ అభిప్రాయం ప్రకారం.. పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం అస్సలు సురక్షితం కాదు. అందుకు గల ఐదు ముఖ్యమైన కారణాలను మనం ఓ సారి చూద్దాం.

కడుపు నొప్పి, ఉబ్బరం: కివీ, పనస, ప్యాషన్ ఫ్రూట్ లేదా జామకాయ వంటి ఏ పండులోనైనా చక్కెర, ఈస్ట్ సహజంగానే అధికంగా ఉంటాయి. ఈ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులోని జీర్ణ ఆమ్లాలు పలుచబడతాయి. ఇది కడుపులో ఈస్ట్ వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించి.. కార్బన్ డయాక్సైడ్, ఆల్కహాల్ ఉత్పత్తికి దారితీస్తుంది. ఫలితంగా పొట్టలో గ్యాస్ పేరుకుపోయి, కడుపు ఉబ్బరం, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ స్పష్టం చేస్తోంది.

శరీర pH స్థాయిలలో మార్పులు: పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే అమెరికా వ్యవసాయ శాఖ ప్రకారం వంద గ్రాముల పుచ్చకాయలో దాదాపు 91.4 గ్రాముల నీరు ఉంటుంది. ఇలాంటి పండ్లను తిన్న వెంటనే మళ్లీ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ యొక్క pH స్థాయి (ఆమ్లత్వం లేదా క్షారత్వం) దెబ్బతింటుంది. కడుపులోని సహజ ఆమ్లత్వం తగ్గిపోవడం వల్ల జీర్ణక్రియ అస్తవ్యస్తంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

మందగించే జీర్ణక్రియ: పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపులో ఆహార శోషణ, జీర్ణ ప్రక్రియలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల కడుపులో ఎసిడిటీ ఏర్పడటమే కాకుండా.. కొంతమందిలో వికారం లేదా వాంతులు వచ్చే భావన కలుగుతుంది. అందుకే పండ్లు తిన్న తర్వాత కనీసం గంట పాటు నీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు.. ఎంజైమ్‌లు అత్యంత శక్తివంతంగా ఉండాలి. పండ్లు తిన్న వెంటనే నీరు తాగితే ఈ జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల అవసరమైన ఎంజైమ్‌ల స్రావం తగ్గిపోయి ఆహారం సరిగ్గా జీర్ణం కాక.. గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీకి దారితీస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం: పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి.. జీర్ణం కాని ఆహారం శరీరంలోనే ఉండిపోతుంది. ఇది చివరికి కొవ్వుగా మారి, శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. దీర్ఘకాలిక మధుమేహం వల్ల అంధత్వం, మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు సంభవిస్తాయి.

అందువల్ల, ముఖ్యంగా నిమ్మజాతి పండ్లు (సిట్రస్ జాతి), నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తిన్న తర్వాత నీరు తాగకుండా జాగ్రత్తపడాలి. పండ్లు తిన్న తర్వాత అవి శరీరంలో పూర్తిగా జీర్ణం కావడానికి, ఎలాంటి దుష్ప్రభావాలు రాకుండా ఉండటానికి కనీసం అరగంట నుండి ఒక గంట సమయం విరామం ఇవ్వడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనంలో పండ్లు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాల గురించి అందించిన సమాచారం కేవలం సాధారణ అవగాహన, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన వైద్య సలహాకు, వ్యాధి నిర్ధారణకు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ప్రతి ఒక్కరి శరీర తత్వం, జీవనశైలి, ఆరోగ్య అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి, మీ వ్యక్తిగత ఆహార నియమాలలో ఎలాంటి మార్పులు చేయాలన్నా లేదా ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా ఎల్లప్పుడూ ఒక అర్హత కలిగిన వైద్యుడిని లేదా క్లినికల్ న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం శ్రేయస్కరం. మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రజాపక్షం ఎటువంటి బాధ్యత వహించదు.