Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చినబాబు లోకేష్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జూలై 18… జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా…

Prajapaksham 14 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
చినబాబు లోకేష్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జూలై 18… జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా…

చినబాబు లోకేష్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జూలై 18... జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన ఎల్లో మీడియా...

జూలై 18వ తేదీ ఏం జరుగుతుందా అని టిడిపి శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇది రాజకీయ సమావేశం కాదని తమకు ఎలాంటి రాజకీయ జెండా లేదని ప్రకటించినప్పటికీ కూడా, తెలుగుదేశం చెందిన సంబంధిత సోషల్ మీడియా గ్రూపులు జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే ట్రోలింగ్ ప్రారంభించాయి. ఇక ప్రధాన స్రవంతి మీడియా కూడా జూలై 18 నుంచి అందరి దృష్టి మళ్లించడానికి తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఒక వివాదాస్పద టీవీ ఛానల్ అధినేత ప్రతిరోజు నిర్వహించే చర్చా కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ను చులకన చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అసలు జూలై 18న ఏం చేయబోతున్నారు. రూ. 100 కోట్లు పెట్టి సామాజిక సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రత్యేకంగా చేయాల్సిన పరిస్థితి ఏముంది వాటి ప్రశ్నలు అటు తెలుగుదేశం వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో తమిళనాడులో కూడా విజయ్ ఇదే తరహాలో సేవా కార్యక్రమాలు అంటూ తన ఫ్యాన్స్ ను యాక్టివేట్ చేసే ప్రయత్నం చేశారు. అభిమాన సంఘాలు ఆ తర్వాత పార్టీ నిర్మాణంగా మారి తమిళనాడు రాజకీయాల్లో చరిత్ర సృష్టించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ జూలై 18వ తేదీన తిరుపతిలో నిర్వహించనున్న ఈ సేవా కార్యక్రమాల వెనుక తప్పనిసరిగా రాజకీయ అజండా ఉంటుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. రాజకీయ జెండా లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేస్తూ ఎందుకు ట్రోల్లింగ్ చేస్తున్నారని, నిలదీస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా ఒక జూనియర్ ఎన్టీఆర్ అభిమాని చేతిలో తారక్ ఫోటో పట్టుకొని నిలబడితే చంద్రబాబు అతడిని పిలిచి ఇంకోసారి జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్ కనిపిస్తే బాగుండదని హెచ్చరించిన వార్త గమనించవచ్చు. మరోసారి నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తే, స్వయంగా రంగంలోకి దిగి ఆ ఫ్లెక్సీలను చింపేసిన ఘటన మీడియాలో రికార్డు అయింది. దీన్నిబట్టి తెలుగుదేశం పార్టీలో ఎక్కడో జూనియర్ ఎన్టీఆర్ పట్ల భయం అదే విధంగా అసహనం ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ః

అలాగే గతంలో అనంతపురానికి చెందిన ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాని అడ్డుకుంటానని చేసిన ఫోన్ సంభాషణ వైరల్ అయింది. ఇందులో లోకేష్ పేరు ప్రస్తావిస్తూ జూనియర్ ఎన్టీఆర్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వివాదం పై ఎమ్మెల్యే సంజాయిషి ఇచ్చినప్పటికీ, తెలుగుదేశం వర్గాల్లో మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది అని చెప్పవచ్చు. మొత్తానికి జూలై 18 అనేది ఏం జరుగుతుంది అనే దానిపైన తెలుగుదేశం వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చతో పాటు అటు లోకేష్ సన్నిహితుల్లో కూడా ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరగవద్దని పంతంగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. మరి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వార్లో ఎవరిది పై చేయి సాధిస్తారో ఎదురు చూడాల్సిందే.

ట్యాగ్‌లు: andhra pradesh jr ntr Nara Lokesh