Skip to content
తెలంగాణ వార్తలు

CM Revanth Press Meet: కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పేవారికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం: సీఎం రేవంత్ రెడ్డి..

Prajapaksham 11 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
CM Revanth Press Meet: కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పేవారికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం: సీఎం రేవంత్ రెడ్డి..

కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పేవారికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం: సీఎం రేవంత్ రెడ్డి..

కాళేశ్వరం ప్రాజెక్టుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కాళేశ్వరంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019 జూన్ 21న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని. అయితే ప్రాజెక్టు ప్రారంభమైన కేవలం 11 నెలల్లోనే, 2020 మే 18న మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, రాబోయే వర్షాకాలానికి ముందే వాటిని సరిచేయకపోతే బ్యారేజ్ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.వి. రమణారెడ్డి సంబంధిత నిర్మాణ సంస్థకు లేఖ ద్వారా హెచ్చరించారని, అయినప్పటికీ, అప్పటి ప్రభుత్వం మరియు నిర్మాణ సంస్థలు ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఫలితంగా నిర్మాణ లోపాలు మరింత తీవ్రమై, చివరకు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

2022 జూలైలో గోదావరి వరదలతో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగి తీవ్రంగా దెబ్బతినగా. అయినా పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టకపోవడంతో ఇప్పటికీ అది 100 శాతం వినియోగంలోకి రాలేదు. 2023 అక్టోబర్ 21న, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, సాగునీటి శాఖ బాధ్యతల్లో ఉన్న సమయంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ ప్రక్రియ కూడా అప్పటి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది.నవంబర్ 1, 2023 నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాథమిక నివేదిక మేడిగడ్డ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, నిర్మాణ నాణ్యత, ఆపరేషన్, మెయింటెనెన్స్‌లోని లోపాలే కారణమని స్పష్టంగా ఎత్తిచూపిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

2025 ఏప్రిల్ 24న ఎన్డీఎస్ఏ 365 పేజీల తుది నివేదికను విడుదల చేసింది. నిపుణుల క్షేత్రస్థాయి పరిశీలనలు, వివిధ సాంకేతిక పరీక్షల అనంతరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రస్తుత స్థితిలో నీటి నిల్వకు, మళ్లింపునకు సురక్షితం కావని స్పష్టంగా తేల్చిందన్నారు. పునరుద్ధరణ డిజైన్లు, మరమ్మతులు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సెంట్రల్ వాటర్ కమిషన్ ఆమోదంతోనే చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ 365 పేజీల నివేదికనే ప్రామాణికంగా తీసుకుని, నిపుణుల కమిటీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అలాగే కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పేవారికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో మోదీ, అమిత్ షా కాళేశ్వరంపై ఆరోపణలు చేశారని. ఇప్పుడు ఏ చీకటి ఒప్పందం సీబీఐ విచారణను ఆపుతోంది. ఈటెల రాజేందర్ ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. మావి రెండే డిమాండ్లు. NDSA పర్యవేక్షణలో నీళ్లు ఎత్తిపోయడం, సీబీఐ విచారణ మొదలుపెట్టాలి. ఈ రెండింటికీ ఈటలకు మద్దతు తెలుపుతాం’’ అని పేర్కొన్నారు.

గురుదక్షిణ కోసమే ఏపీకి తెలంగాణ జలాలు ధారాదత్తం చేస్తున్నారంటూ హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. అన్నం తినేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? పట్టిసీమలో గోదావరి జలాలను కృష్టా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలు తరలించినప్పుడు హరీష్‌రావు గాడిదలు కాస్తున్నాడా? అప్పుడు మంత్రిగా నువ్వే ఉన్నావ్ కదా? అంటూ ప్రశ్నించారు.

ట్యాగ్‌లు: Telangana