Lenin Review: అయ్యగారి సినిమాకు పాజిటివ్ టాక్… ఎమోషనల్ అయిన అఖిల్..
లెనిన్ పైనే నాగార్జున ఆశలు... అఖిల్‌కు టైర్ వన్ హీరో అయ్యే యోగం ఉందా..? ( Image: X.com)
అక్కినేని అందగాడు మూడో తరం వారసుడు అక్కినేని అఖిల్ ఎట్టకేలకు లెనిన్ సినిమాతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రేడ్ పండితుల నుంచి వస్తున్న రివ్యూల ప్రకారం చూసినట్లయితే ఇప్పటివరకు దాదాపు అని రివ్యూ లో కూడా పాజిటివ్ టాక్ లో వస్తున్నాయి. అఖిల్ పర్ఫామెన్స్ సినిమాలో బాగుందని మంచి మార్కులు పడుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా కథ చాలా రియలిస్టిక్ గా ఉందని అంతేకాదు సినిమాలో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ వల్లనే హిట్ టాక్ సొంతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మొదటి ఆట నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో అటు అక్కినేని అఖిల్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. తన తండ్రి నాగార్జునను పట్టుకొని అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఎట్టకేలకు దాదాపు దశాబ్దం తర్వాత అఖిల్ సినిమాకు ఒక పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అక్కినేని అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు దర్శకుడిగా కిషోర్ అబ్బూరు ఉండగా, ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు.
లెనిన్ సినిమా సంబంధించి ఇప్పటివరకు అటు ఓవర్సీస్ లో కూడా మంచి టాక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్ రివ్యూలను బట్టి చూసినట్లయితే ఓవర్సీస్ లో కూడా దాదాపు అన్ని షోస్ కూడా హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీకెండ్ లో అఖిల్ లెనిన్ జోష్ చూపించే అవకాశం కనిపిస్తోంది. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే, అఖిల్ తొలి 100 క్రోర్స్ మూవీ క్లబ్ లో చేరే అవకాశం కూడా ఉన్నట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రెండు వారాలపాటు అఖిల్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేవు. అలాగే మేజర్ సినిమాలు కూడా పెద్దగా ఆడక పోవడంతో ప్రేక్షకులు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. . అలాంటి సమయంలో లెనిన్ సినిమా ఎట్టకేలకు పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకోవడం అటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతోంది.