Skip to content
బిజినెస్ వార్తలు

దేశ ఆర్థిక భద్రతకు కీలకం ‘కోకింగ్ కోల్’

Prajapaksham 14 Jun 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
దేశ ఆర్థిక భద్రతకు కీలకం ‘కోకింగ్ కోల్’

Why Coking Coal Matters for National Economic Stability (photo-AI Generated Image)

ఇనుము, ఉక్కు కర్మాగారాల్లో ఉపయోగించే కోకింగ్ కోల్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ ప్రకటిస్తూ, గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం, 1957 ప్రకా రం దీనికి ప్రత్యేక హోదా కల్పించింది. భారత ప్రభుత్వం ఈ మార్పును ఎంఎండిఆర్ చట్టంలోని సెక్షన్ 11సి ఆధారంగా చేసింది. ఈ సవరణ ద్వారా చట్టంలోని ఫస్ట్ షెడ్యూల్ పార్ట్ కోల్ నిర్వచనంలో స్పష్టంగా కోకింగ్ కోల్ చేర్చడమే కాకుండా, పార్ట్ లో దాన్ని ప్రత్యేకంగా ‘క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్’ గా జాబితా చేసింది. అంటే, కోకింగ్ కోల్ దేశ ఆర్థిక, పారిశ్రామిక భద్రతకు అత్యం త కీలకమైన వనరుగా అధికారికంగా గుర్తింపు పొందింది. కోకింగ్ కోల్ సాధారణ బొగ్గుతో పోల్చి చూడలేం. దీనిని మెటలర్జికల్ కోల్ అని కూడా అంటారు. ఇది ప్రత్యేక రకమైన బిట్యూమినస్ బొగ్గు. దీన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో కాల్చినప్పుడు కోక్ అనే పదార్థం తయారవుతుంది. ఈ కోక్ ఉక్కు తయారీలో, ముఖ్యంగా సంప్రదాయ బ్లాస్ట్ ఫర్నేస్ పద్ధతిలో, తప్పనిసరిగా అవసరమైన ముడిసరకుగా పనిచేస్తుంది. ఇనుము ధాతువు ను పిగ్ ఐరన్ మార్చే ప్రక్రియలో కోక్ ప్రత్యామ్నాయం ఇప్పటికీ పూర్తిగా లభించలే దు. కోకింగ్ కోల్ ఉన్న ప్రత్యేక విలువ దాని భౌతిక, రసాయన లక్షణాల్లోనే దాగుంది. ఇది వేడి చేసినప్పుడు మెత్తబడుతూ, ఉబ్బుతూ, తిరిగి గట్టి కోక్ మారే కేకింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. అలాగే ఇందులో బూడిద, గంధకం, ఫాస్ఫరస్ వంటి మలినాలు తక్కువగా ఉండటం చాలా ముఖ్యం. ఈ లక్షణాల వల్లే ఇది ఉక్కు తయారీలో అత్యంత నాణ్యమైన ముడిసరకుగా మారింది. ఒక టన్ను ఉక్కు తయారయ్యేందుకు సగటున సుమారు 780 కిలోగ్రాముల కోకింగ్ కోల్ అవసరం అవుతుందన్న అంచనా, దీని వ్యూహాత్మక ప్రాధాన్యతను మరింత స్పష్టంగా చూపిస్తుంది. ప్రపంచ స్థాయిలో చూస్తే, కోకింగ్ కోల్ ఉత్పత్తి లో చైనా, ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, కెన డా వంటి దేశాలు ముందున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్రపంచ మార్కెట్ కోకింగ్ కోల్ సరఫరాకు కీలక కేంద్రంగా ఉంది. అంతర్జాతీయ ధరలు, సరఫరా గొలుసులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఈ దేశాల విధానాల పై బాగా ఆధారపడి ఉంటాయి. ఈ పరిస్థితు ల్లో ఒక దేశం తన ఉక్కు పరిశ్రమకు అవసరమైన ప్రధాన ముడిసరకును భారీగా దిగుమతులపై ఆధారపడి పొందడం, దీర్ఘకాలికంగా ఆర్థిక, వ్యూహాత్మక ప్రమాదాలకు దారి తీస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *