Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో దంచికొట్టనున్న వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Telangana Rains
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
వాతావరణ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరో 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తీవ్ర వర్ష సూచనల నేపథ్యంలో అధికారులు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేశారు.
మరింత బలపడనున్న వాయుగుండం:
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండం (Deep Depression)గా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని మూలంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్నారు.
వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల నివాసితులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
- TRAI New Rules: డేటా అవసరం లేని వారికి గుడ్‌న్యూస్.. కేవలం కాల్స్, SMS కోసం తక్కువ కాలపరిమితి రీఛార్జ్‌లు..
- Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో దంచికొట్టనున్న వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Telangana SIR: తెలంగాణలో ఓటర్లకు అలర్ట్.. 43 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం.. స్పందించకపోతే తుది జాబితా నుంచి తొలగింపు
- Andhra Pradesh Rain Alert: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. రేపు రాత్రి విశాఖ–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం..
- Khairatabad Ganesh Darshan: భక్తులకు అలర్ట్.. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం రేపు అర్ధరాత్రి వరకే.. 23 తర్వాత భక్తులకు నో ఎంట్రీ.. 25న నిమజ్జనం..