Skip to content
తాజా
పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్..200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌ నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ. వేల కోట్లు దోచుకుంది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ హైలైట్స్.. ఎన్ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట.. రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపాలి.. విశాఖ ఆక్వా కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. భారత కరెన్సీలో మార్పులపై సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన.. త్వరలో ప్లాస్టిక్ నోట్లు వస్తాయా.. హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు సంఖ్య.. భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్..హైకోర్టులో నో రిలీఫ్ .. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై దాడులను ఖండించిన ప్రజాస్వామ్యవాదులు.. సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీవ్ర ఆగ్రహం.. ఐరాస భద్రతా మండలి నుంచి పాకిస్థాన్ ఔట్.. కిర్గిస్తాన్ తొలిసారిగా ఎంట్రీ.. కొత్తగా ఐదు దేశాల ఎన్నిక పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్..200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్‌ నిజామాబాద్‌లో తీవ్ర విషాదం.. మంజీరా నదిలో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ. వేల కోట్లు దోచుకుంది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ హైలైట్స్.. ఎన్ఐఏ కేసులో గాదె ఇన్నయ్యకు ఊరట.. రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు రొయ్యల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపాలి.. విశాఖ ఆక్వా కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. భారత కరెన్సీలో మార్పులపై సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన.. త్వరలో ప్లాస్టిక్ నోట్లు వస్తాయా.. హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు సంఖ్య.. భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తమిళనాడులో అరెస్ట్..హైకోర్టులో నో రిలీఫ్ .. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై దాడులను ఖండించిన ప్రజాస్వామ్యవాదులు.. సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీవ్ర ఆగ్రహం.. ఐరాస భద్రతా మండలి నుంచి పాకిస్థాన్ ఔట్.. కిర్గిస్తాన్ తొలిసారిగా ఎంట్రీ.. కొత్తగా ఐదు దేశాల ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కర్ణాటక నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. షర్మిలకు మొండిచేయి..

Prajapaksham 05 Jun 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
కర్ణాటక నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన.. షర్మిలకు మొండిచేయి..

YS Sharmila Misses Out as Congress Finalises Karnataka Rajya Sabha Nominees

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీపీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల కర్ణాటక కోటా నుండి రాజ్యసభకు వెళ్తారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా సాగిన ఊహాగానాలకు తెరపడింది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమెకు నిరాశే మిగిలింది.

కర్ణాటక నుండి మొత్తం ముగ్గురు అభ్యర్థులను రాజ్యసభకు పంపేందుకు సరిపడా సంఖ్యా బలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరై ఖర్గేకు మద్దతు తెలపనున్నారు.

మల్లికార్జున ఖర్గేతో పాటు మిగిలిన రెండు స్థానాలకు కూడా కాంగ్రెస్ అధిష్ఠానం గురువారమే అభ్యర్థులను ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడా, అలాగే కేంద్ర మాజీ మంత్రి రెహ్మాన్‌ఖాన్ కుమారుడైన మన్సూర్ ఆలీఖాన్‌లకు ఈసారి కర్ణాటక నుండి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో షర్మిల రాజ్యసభ ఎంట్రీపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *