Skip to content
తెలంగాణ వార్తలు

మహిళల భద్రత, సమాన హక్కులే మా అజెండా: ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ సీనియర్ నేత పశ్య పద్మ

Prajapaksham 05 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
మహిళల భద్రత, సమాన హక్కులే మా అజెండా: ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ సీనియర్ నేత పశ్య పద్మ

Promoting Women's Rights Is the Core Goal of NFIW: Senior Leader Pashya Padma

స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడుతూనే మహిళల హక్కులను పెంపొందించడమే ఎన్ఎఫ్ఐడబ్ల్యూ లక్ష్యం అని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకులూ, సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యులు పశ్యపద్మ పేర్కొన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) 72 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా హైదరాబాద్, హిమాయత్ నగర్, అమృత ఎస్టేట్స్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యాలయం వద్ద గురువారం కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పతాకాన్ని పశ్యపద్మ ఎగురువేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సామాజిక-ఆర్థిక అసమానతలు మరియు లింగ-ఆధారిత హింసను పరిష్కరించడానికి మహిళలను సంఘటితం చేసిన ఘనత ఎన్ఎఫ్ఐడబ్ల్యూ కె ఉందని తెలిపారు. పార్లమెంట్ లో మహిళలకు 33% రేజర్వేషన్ల బిల్లు ను తీసుకవచ్చి ఆమోదించాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకురాలు అప్పటి పార్లమెంట్ సభ్యురాలు గీత ముఖర్జీ డిమాండ్ చేసిందని గుర్తు చేసారు. నేటి బీజేపీ నిరంకుశ కేంద్ర పాలకులు మహిళలకు 33% రేజర్వేషన్ల బిల్లు ను పార్లమెంట్ లో ఆమోదించి, అమలు చేయకుండా బుట్టదాఖలు చేసారని మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు 33% రేజర్వేషన్ల కల్పించేదాకా దేశవ్యాప్తంగా ఉద్యమించాలని పశ్యపద్మ పిలుపునిచ్చారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సీనియర్ నాయకులూ, తెలంగాణ వర్కింగ్ విమెన్ ఫోరమ్ అధ్యక్షులు పి. ప్రేమ్ పావని మాట్లాడుతూ మహిళలకు తగినంత చట్టపరమైన రక్షణ లేకపోవడం మరియు నిరంతర సామాజిక అసమానతలు వంటి స్వాతంత్ర్యానంతర సవాళ్లను ఎదురుకోవడానికి 1954 లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఒక ప్రజా సంస్థగా స్థాపించబడిందని తెలిపారు. పెట్టుబడిదారీ విధానాలకు, మతపరమైన విభజనలకు, పెరుగుతున్న ధరలు, ఆహార కొరత మరియు లింగ-ఆధారిత హింస వ్యతరేకంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. ప్రజాసమస్యలతోపాటు మహిళా కార్మికులకు ఆర్థిక మరియు లింగ సమానత్వం కోసం పోరాటాలు నిర్వహించాలని ప్రేమ్ పావని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ మంద సదాలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు షేక్ ఫైమీద బేగం, జె. లక్ష్మి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పడాలి నలిని, కార్యదర్శి సక్రి బాయ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ఉజ్జిని హైమావతి, నాయకులూ గిరిజ కృష్ణమూర్తి ప్రమీల, మాధవి, మహాలక్ష్మి, జ్యోతి శ్రీమాన్, చంద్రమ్మ, జ్యోత్, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *