చిరంజీవికి కూటమి ప్రభుత్వం మెగా ఆఫర్ ఇచ్చినట్లేనా.. తమ్ముడి బాటలోకే అన్న కూడా వస్తున్నారా..
Chiranjeevi and Chandrababu
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఏదో వార్తతో చర్చల్లో నిలుస్తుంటాయి. తాజాగా మెగా ఫ్యామిలీ వార్తలు లైవులోకి వచ్చాయి. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ కావడం.. ఆ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకే తెరలేపాయి. కూటమి ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవిని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి మెగా బ్రదర్స్ బహిరంగంగా సపోర్ట్ ఇచ్చారు. సోషల్ మీడియా సందేశాలు, రూ. 50 లక్షల విరాళంతో కూటమికి అండగా నిలిచారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబులు ఇద్దరూ కలిసిన చిరంజీవికి ప్రత్యేక గౌరవాన్ని అందించారు.
ఇటీవల వరద బాధితుల సహాయార్థం రూ. కోటి చెక్కును అందించేందుకు చంద్రబాబు నివాసానికి వెళ్లిన సందర్భంలోనే ఈ బ్రాండ్ అంబాసిడర్ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ముందస్తుగా చర్చించిన తర్వాతే చిరంజీవి అపారమైన ప్రజాదరణ, క్రేజ్‌ను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుకోవాలని బాబు మాస్టర్ ప్లాన్ చేశారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సినీ నటుడు నాగార్జున ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అదే రీతిలో ఇప్పుడు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అట్టడుగు వర్గాల్లోకి తీసుకెళ్లేందుకు చిరంజీవే సరైన ఛాయిస్ అని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ హోదాకు తగినట్లుగా ఆయనకు కేబినెట్ ర్యాంక్ కల్పిస్తూ అధికారిక పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పాటుగా చిరంజీవి ద్వారా ఏపీకి.. సినీ పరిశ్రమను వేగంగా విస్తరించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.
సిఎం చంద్రబాబు నేరుగా తన ముందుంచిన అంబాసిడర్ అవకాశంపై చిరంజీవి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన చేసే ముందు తన సినిమాల షెడ్యూళ్లు, ఇతర వ్యక్తిగత కమిట్మెంట్లను సరిచూసుకోవడానికి కొంత సమయం అడిగినట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. ప్రభుత్వ ప్రచారకర్తగా ఏపీ రాజకీయంలో రీ-ఎంట్రీ ఇస్తే.. అది రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది.
- Jurala Project: జూరాల వద్ద ఉద్రిక్తత.. సాగునీటి కోసం రైతుల ఆందోళన, BRS నేత చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్ట్ (Video)
- Jagadish Reddy Farmhouse: జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల పరిశీలన.. భూములపై సంచలన ఆరోపణలు
- Nani The Paradise: ది ప్యారడైజ్‌కు ఏపీలో టికెట్ రేట్ల పెంపు.. ప్రీమియర్ షోలకు కూడా అనుమతి
- AP Junior Doctors Stipend Hike: ఏపీ జూనియర్ డాక్టర్లకు గుడ్‌న్యూస్.. స్టైపెండ్ పెంపు, జనవరి 1 నుంచే అమలు
- Varupula Subbarao Joins Jana Sena: వైసీపీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక