Skip to content
జాతీయం వార్తలు

అయోధ్య రామ మందిర విరాళాల స్కాం.. పెద్దల హస్తం ఉందంటూ ప్రియాంక గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు..

Prajapaksham 27 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
అయోధ్య రామ మందిర విరాళాల స్కాం.. పెద్దల హస్తం ఉందంటూ ప్రియాంక గాంధీ వాద్రా కీలక వ్యాఖ్యలు..

Priyanka Gandhi Demands Transparent Inquiry, Opposes Any Cover-Up

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విచారణ పేరుతో ప్రభుత్వం కేవలం ‘కప్పిపుచ్చే’ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ.. ఈ మహా ‘దొంగతనం’పై అత్యంత పారదర్శకమైన విచారణ జరపాలని, ఇందులో ప్రమేయం ఉన్న పెద్దలందరికీ కఠిన శిక్షలు విధించాలని శుక్రవారం డిమాండ్ చేశారు.

ఈ కుంభకోణంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హిందీలో స్పందించిన ప్రియాంక గాంధీ, మర్యాద పురుషోత్తముడు మరియు సత్యధర్మాలకు ప్రతిరూపమైన ఆ శ్రీరామునిపైనా, ఆయనను నమ్ముకున్న కోట్లాది మంది భక్తుల అచంచలమైన విశ్వాసానికీ వ్యతిరేకంగా జరిగిన ఈ మోసపూరితమైన దొంగతనం, దోపిడీ చర్యతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం కొద్దిమంది తక్కువ స్థాయి జూనియర్ ఉద్యోగులు మాత్రమే ఒంటరిగా వ్యవహరించి, పక్కా ప్రణాళికతో సీసీటీవీ కెమెరాలను ఆపివేసి, వేల కోట్ల రూపాయల విలువైన కానుకలను అంత సులభంగా దుర్వినియోగం చేయగలరా? అంటూ ఆమె ప్రభుత్వ దర్యాప్తు తీరును నిలదీశారు. దీని వెనుక పెద్దల హస్తం ఉందని, కేవలం కింది స్థాయి సిబ్బందిని బలిపశువులను చేసి అసలు దోషులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. భక్తుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో పూర్తి నిజాలు బయటకు రావాలంటే పారదర్శక దర్యాప్తు ఒక్కటే మార్గమని ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *