అకాలీదళ్ అధినేత సుక్బీర్ సింగ్ బాదల్‌పై గురుద్వారాలో దాడి.. నాందేడ్‌లో ఉద్రిక్తత..
Attack on Sukhbir Singh Badal
శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో బుధవారం విద్వేషపూరిత దాడి జరిగింది. నగరం శివారు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాందేడ్‌లోని ప్రసిద్ధ సిక్కు పుణ్యక్షేత్రం ‘తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్’ గురుద్వారాను సందర్శించి వస్తున్న సమయంలో ఒక నిహంగ్ సిక్కు తన వద్ద ఉన్న కిర్పన్ (తలపాగాతో కూడిన కత్తి/తల్వార్)తో ఒక్కసారిగా బాదల్పైకి దూసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ కూడా అక్కడే ఉన్నారు.
హఠాత్తుగా జరిగిన ఈ దాడిలో సుఖ్బీర్ బాదల్ భద్రతా సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. దాడి అనంతరం సుఖ్బీర్ బాదల్‌ను వెంటనే నాందేడ్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన తన కుడిచేతికి కాషాయ రంగు వస్త్రాన్ని చుట్టుకుని ఆసుపత్రికి వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బాదల్ చేతికి గాయమైనప్పటికీ, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో అకాలీదళ్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
కాగా, గతంలో 2024 డిసెంబర్ 4న అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం (Golden Temple) వద్ద సేవాదార్ డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో కూడా సుఖ్బీర్ బాదల్‌పై ప్రాణాంతక దాడి యత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ తాజా దాడి ఘటనపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.
- CEC Resignation Row: జ్ఞానేశ్ రాజీనామా వరకు కదలను.. ఢిల్లీ రోడ్డుపైనే బైఠాయించిన రాహుల్
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?