కంపెనీల లాభాలే కాదు కార్మికుల జీవితం కూడా ముఖ్యమే
Workers
డాక్టర్. కోలాహలం రామ్ కిశోర్
ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే అక్కడి కార్మికులను ఎలా చూస్తున్నారో గమనిస్తే సరిపోతుంది. ఆర్థికవృద్ధి, సాంకేతిక ప్రగతి, ప్రపం స్థాయి కంపెనీలు అన్నీ ముఖ్యమే. కానీ వాటి వెనుక నిలబడి చెమటోడ్చే మనిషి ఆరోగ్యం, అతని కుటుంబ జీవితం, అతని మానసిక ప్రశాంతత, అతని గౌరవం కంటే ఏ లాభమూ పెద్దది కాదు. ఈ మౌలిక సత్యాన్ని గుర్తుచేసే సంఘటన ఇటీవల ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.ఫ్రాన్స్‌లో ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగుల పనివేళల నమోదు చేసే విధానం అక్కడి కార్మిక చట్టాలకు అనుగుణంగా లేదని నిర్ధారించిన కార్మిక శాఖ, సంస్థపై రూ.175,000 జరిమానా విధించింది. ఈ చర్య వెనుక ఉద్దేశం కేవలం ఒక కంపెనీని శిక్షించడం కాదు. కార్మిక చట్టాలు అనేవి కాగితాలపై రాసిన నిబంధనలు మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగి జీవితాన్ని రక్షించే భద్రతా కవచమ ప్రపంచానికి తెలియజేయడమే.ఫ్రాన్స్‌లో వారానికి చట్టబద్ధమైన సాధారణ పనివేళలు 35 గంటలు. అదనం గా పనిచేస్తే అదనపు వేతనం, విశ్రాంతి సమయం, సెలవులు, ఉద్యోగి ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. యజమానులు ప్రతి ఉ ద్యోగి ఎంతసేపు పనిచేశాడో ఖచ్చితంగా నమోదు చేయా లి. ఎందుకంటే పనిగంటలు దాచిపెడితే, అదనపు శ్రమ ను దోచుకోవడం చాలా సులభమవుతుంది. అందుకే అక్కడ చట్టం ఉద్యోగి తరఫున నిలుస్తుంది.
ఈ సంఘటన మరోసారి ఒక పెద్ద చర్చను ముందు తెచ్చింది. కొంతకా క్రితం వారానికి 70 గంటలు పనిచేయాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్.ఆర్. నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఎక్కువ పనిచేయడం వ్యక్తిగత ఎంపిక కా వచ్చు. కానీ దానిని సమాజమంతటికీ ఆదర్శంగా చూ పించడం, లేదా సంస్థాగత సంస్కృతిగా మార్చడం చా జాగ్రత్తగా చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి ఉ ద్యోగి పరిస్థితి ఒకేలా ఉండదు. ఆరోగ్యం, కుటుంబ బా ధ్యతలు, మానసిక సామర్థ్యం, వయస్సు, జీవన పరిస్థితు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. కూడా కార్మికులను రక్షించే చట్టాలు ఉన్నాయి. కొత్తగా అమలులోకి వస్తున్న లేబర్ కోడ్స్‌తో పాటు, రాష్ట్రాల దుకాణాలు, వాణిజ్య సంస్థల చట్టాలు, ఫ్యాక్టరీల చట్టాలు ఉద్యోగుల పనిగంటలు, విశ్రాంతి, వారాంతపు సెలవులు, అదనపు పనికి అదనపు వేతనం వంటి అంశాలను నిర్దేశిస్తాయి. సాధారణంగా రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు మించి పనిచేయిస్తే అదనపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది. వారానికి మొత్తం పనిగంటలకు కూడా పరిమితులు ఉంటాయి. అయితే చట్టాలు ఉండటం ఒక విషయం అయితే, వాటిని సమర్థంగా అమలు చేయడం మరో విషయం. అసంఘటిత రంగంలో, కొన్ని ప్రైవేట్ రంగ సంస్థ ల్లో ఉద్యోగులు తమ హక్కులను వినియోగించుకోవడం ఇప్పటికీ సులభం కాదు. పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. అక్కడ ఫెడరల్ చట్టాల ప్రకారం సాధారణంగా వారానికి 40 గంటలకు మించి పనిచేస్తే అనేక వర్గాల ఉద్యోగులకు అదనపు వేతనం చెల్లించాలి. అయితే ఉద్యోగి వర్గాన్ని బ ట్టి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఐరోపాలోని అనేక దేశాల్లో మా త్రం పనిగంటలపై మరింత కఠినమైన రక్షణ ఉంది. యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం సాధారణంగా వారానికి సగటున 48 గంటలకు మించి పనిచేయించరాదు. రోజువారీ విశ్రాంతి, వారాంతపు విశ్రాంతి, చెల్లిం పు సెలవులు వంటి హక్కులకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించబడింది. అంటే ఉత్పాదకతతో పాటు మానవ జీవిత నాణ్యతకు కూడా సమాన ప్రాధా న్యం ఇవ్వాలనే దృక్పథం అక్కడ కనిపిస్తుంది.
పనిగంటలు పెరగడం అంటే కేవలం ఎక్కువ పని చేయడం మాత్రమే కాదు. అది క్రమంగా కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని తగ్గిస్తుంది. పిల్లల పెరుగుదలను చూసే అవకాశాన్ని దూరం చేస్తుంది. స్నేహాలు, సామాజిక సంబంధాలు, వ్యక్తిగత అభిరుచులు అన్నీ క్రమంగా కనుమరుగవుతాయి. విశ్రాంతి తగ్గడంతో గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా అనేక వైద్య పరిశోధనలు సూచిస్తున్నాయి. అలసిపోయిన ఉద్యోగి చివరకు సంస్థకూ ఎక్కువ ప్రయోజనం చేకూర్చడు.ఇంకోవైపు, ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, రోబోటిక్స్ వేగంగా విస్తరిస్తున్నా ఒకవైపు మిగిలిన ఉద్యోగులను ఎక్కువ గంటలు పనిచేయమని కోరడం, మరోవైపు అదే సమయంలో వేలాది మంది ఉద్యోగులను తొలగించడం అనే పరిస్థితి అనేక రంగాల్లో కనిపిస్తోంది. సాంకేతిక అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించరు. కానీ దాని ఫలితాలు కొద్దిమంది వాటాదారుల లాభాలకే పరిమితమై, ఉద్యోగుల జీవితాలు అస్థిరంగా మారితే అది స మాజంలో అసమానతలను మరింత పెంచుతుంది. లా భాలను మాత్రమే అభివృద్ధి ప్రమాణంగా తీసుకునే ఆర్థిక వ్యవస్థ చివరికి సామాజిక అసంతృప్తిని కూడా పెంచుతుంది.ప్రపంచంలోని అనేక ప్రముఖ సంస్థలు ఇప్పుడు మరో దిశలో ఆలోచిస్తున్నాయి. ఉద్యోగులకు అనువైన పనివేళలు, ఇంటి నుంచే పని చేసే అవకాశాలు, మానసి క ఆరోగ్య కార్యక్రమాలు, నాలుగు రోజుల పని వారంపై ప్రయోగాలు వంటి చర్యలను పరిశీలిస్తున్నాయి. కార ణం ఒక్కటే. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగి దీర్ఘకాలంలో సంస్థకు మరింత విలువను సృష్టిస్తాడనే అవగాహన పెరుగుతోంది.కార్మికుడి శ్రమ ఒక వస్తువు కాదు. అతను ఒక మనిషి. అతనికి కుటుంబం ఉంది. కలలు ఉన్నాయి. ఆరోగ్యం ఉంది. విశ్రాంతి తీసుకునే హక్కు ఉంది. అతని సమయాన్ని గౌరవించడం అంటే అతని జీవితాన్ని గౌరవించడం. ఆ హక్కును కాపాడటం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు; ప్రతి సంస్థకు ఉన్న నైతిక బాధ్యత కూడా.ఫ్రాన్స్ తీసుకున్న చర్య ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ఆర్థికాభివృద్ధి పేరుతో కార్మిక హక్కులను విస్మరించరాదు. చట్టాలు కేవ లం ఉల్లంఘించిన తర్వాత శిక్షించడానికే కాదు, శ్రమకు గౌరవం కల్పించడానికి కూడా ఉంటాయి. లాభాలు పెరగడం ఒక సంస్థ విజయానికి సూచిక కావచ్చు. కానీ ఆ లాభాల కోసం మనిషి ఆరోగ్యం, కుటుంబ జీవితం, గౌ రవం బలి కావడం ఏ సమాజానికీ శాశ్వత అభివృద్ధి కా దు. నిజమైన అభివృద్ధి అంటే సంపదతో పాటు మానవ గౌరవాన్ని కూడా సమానంగా కాపాడగల వ్యవస్థను నిర్మించడమే.
- Pakistan Imran Khan: పాకిస్థాన్ లో అలజడి… ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు
- Ukraine – Russia War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు…రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి…
- Moosi River Front: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
- Telangana New Ration Cards: కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులు పంద్రాగస్టు నుంచి పంపిణీ
- దేశంలో ఎన్‌డిఎ అవినీతి పాలనపై సీపీఐ పోరు బాట.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలతో నిరసన..