Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

అన్ని దానాలలో కెల్లా రక్త దానం మిన్న

Prajapaksham 01 Oct 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
అన్ని దానాలలో కెల్లా రక్త దానం మిన్న

National Voluntary Blood Donation Day

కామిడి సతీష్‌ రెడ్డి,
75 సార్లు స్వచ్ఛంద రక్తదాత,
ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ అవార్డు గ్రహీత


(అక్టోబర్‌ 1వ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా)

రక్తదానం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమయాల లో శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరం ఉంటుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 1వ తేదీన జాతీయ స్వచ్చంధ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు. 1975 సంవత్సరంలో స్వరూప కృష్ణన్‌, డా.జె.జి.జొలిల చొరవ తో ఈ రక్త దాన దినోత్సవం ప్రారంభం అయినది. రక్త దానం చేయాలని ప్రోత్సహిస్తూ రక్తదానం ఆవశ్యకతను తెలియ పరచడం రక్తదాన దినోత్సవం ప్రాముఖ్యతగా చెప్పవచ్చు.
రక్త దానం ఎవరు చేయవచ్చుః ప్రతి ఆరోగ్యవంతుడిలో సుమారు 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది 18 సంవత్సరా ల నుండి 65 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులు. ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకు సుమారు అనగా సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. 45 కిలోల బరువు పైన ఉన్న వారు మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి నుండి రక్తదాత 350 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తదానం చేసే వ్యక్తిని వైద్యుల సంరక్షణలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. హైపటైటిస్‌ బి, హెచ్‌ ఐవి, రక్తహీనత , బలహీనత, షుగర్‌, దీర్ఘకాలిక వ్యాధులతో, బాధపడేవారు రక్తదానం చేయడానికి అనర్హులు. ఒకవేళ తెలియక చేసి రక్తం ఉపయోగపడదు. రక్తదానం చేసిన వారికి పూర్తిస్థాయిలో రక్తం 21 రోజుల్లో తిరిగి ఉత్పత్తి అవుతుంది. రక్తంలో మొత్తం ఎనిమిది గ్రూపులు ఉన్నాయి. 4 నెగటివ్‌ గ్రూపులు, నాలుగు పాజిటివ్‌ గ్రూపులు. రక్తదానం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జిఒ నెంబర్‌ 184 ద్వారా ఆ రోజు స్పెషల్‌ క్యాజువల్‌ మంజూరు చేయబడుతుంది. ప్రపంచంలో అధిక మొత్తంలో ‘ఒ’పాజిటివ్‌ వారే అధికంగా ఉన్నారు. ఒక యూనిట్‌ సుమారు 500 మిల్లీలీటర్లు రక్తంతో మూడు నిండు ప్రాణాలు కాపాడవచ్చు. రక్త దానం చేసే వారు మిగతా వారికన్నా చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు. రక్త గ్రూపులు దేశవ్యాప్తంగా వాని శాతం ఓ పాజిటివ్‌ 46%, ఏ పాజిటివ్‌ 37శాతం, బి నెగిటివ్‌ 8శాతం, ఎ నెగిటివ్‌ 4 శాతం, నెగిటివ్‌ 2%, ఏ బి నెగిటివ్‌ ఒక శాతం. ఒక శాతం ఎబి పాజిటివ్‌. ఒక శాతం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రెడ్‌ క్రాస్‌ అనే అంతర్జాతీ య సంస్థ, మరియు ఆయా జిల్లాల ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న రక్తనిధి కేంద్రాలు అధిక సంఖ్యలో రక్తాన్ని సేకరిస్తున్నా యి. ప్రతి ఏటా వందలాది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ వేల యూనిట్ల రక్తం సేకరిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రాలు, డివిజన్‌ కేంద్రాలలో రక్తదాన కేంద్రాలు ఉన్నాయి. అనేకమంది తమ జన్మదినాలు, పెళ్లి రోజును పురస్కరించుకొని కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ తమ మిత్రులు, బంధువులు, సన్నిహితుల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. బ్లడ్‌ బ్యాంకులకు అందజేస్తూ తమ దాతృత్వంతో, ఉదారతను చాటుతున్నారు. ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకులలో కల్తీ రక్తమును విక్రయిస్తున్నట్లు కూడా వార్తలు వినవస్తున్నాయి. రెడ్‌ క్రాస్‌, ప్రభుత్వ రక్త నిధి కేంద్రాలలో నామమాత్రపు డబ్బులతో రక్తాన్ని విక్రయిస్తున్నారు. రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన కొరవడింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కరపత్రాలు, గోడ పత్రికలు, సదస్సుల ద్వారా గ్రామ ప్రజలు యువతలో, మహిళా సంఘాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.