Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

తలపులను మేలుకొలిపే ‘తటిల్లతలు’

Prajapaksham 19 Oct 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
తలపులను మేలుకొలిపే ‘తటిల్లతలు’

Lightning-creepers

గడ్డం సులోచన

సామాజిక బాధ్యతగా సమాజ హితాన్ని కోరుతూ కవులు కవిత్వం రాస్తుంటారు. ఆ దృక్పథంతోనే కవి ఆనందాచారి ’తటిల్లతలు’ కవితా సంపుటిని వెలువరించారు. ‘తటిల్లతలు’ అంటే మెరుపు తీగలు. 105 చిట్టిపొట్టి కవితల స్థానం కల్పిస్తూ, సమకాలీన జీవిత సత్యాలను, మానవీయ కోణంలో స్పందిస్తూ, తాత్విక చింతనతో, ప్రేమ భావనలతో మానవ భావోద్వేగాలన్నీంటిని సాహితీ లోకంలోకి అడుగుపెట్టిన మరో కవితా సంపుటి ‘తటిల్లతలు’. రచయిత అపారమైన జీవితా నుభవం, లోక పరిశీలన, నిరంతర అధ్యయనం అక్షరాల రూపంలో ప్రవహించింది. కవిత్వమై ప్రతిధ్వనించింది. అందుకే, ‘ధ్వనిస్తూ వచ్చాను/ ధ్వనిస్తూనే పోతాను/మధ్య ప్రతిధ్వనే జీవితం’ అంటాడు. అదే విధంగా, ‘నిజాలు మ రుగున/ అబద్ధాలు వెలుగున/ ఆశల లోకం/ వెలిగే శోకం’ అని వాస్తవాన్ని కళ్ల ముందు ఉం చుతాడు. ’మన ఆలోచనలను అనివార్యంగా మార్చేది ఆచరణే!’ అంటూ, తక్కువ పదాల కూ ర్పుతో లోతైన గంభీరమైన భావాన్ని స్పురింపచేశారు. అవసరాన్ని బట్టి ఈ కవితలు మూడు లై న్ల నుంచి ఎనిమిది లైన్ల వరకు నిడివిని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. ఈ కవితలకు ప్రత్యేకమైన నిర్దిష్టమైన నియమాలేమి లేవు. అ లా లేకపోవడమే ఓ ప్రత్యేకత. ఒక మృదువైన అ నుభూతిగా పలకరిస్తున్న ఓ కవిత – ‘ఇలా పలకరించానంతే/ వేల జ్ఞాపకాల మూటను/ విప్పి పోసింది మనసు-/ వాటిలో కన్నీటి జ్ఞాపకమే/ తీయగా తాకింది’ అంటాడు. నిజమే. పలకరింపులన్నీ వర్తమానాలే కానక్కర్లేదు. అందులో గతాలు కూడా ఉంటాయి. మరోచోట ‘కన్నీళ్ళ నీడలో/ నీ జ్ఞాపకాలు/ నన్ను ముంచెత్తుతాయి / అందుకే/ దుఃఖం నాకొక/ మధురానుభూతి‘ అంటున్నాడు. తీయని బాధగా మధురానుభూతిగా కన్నీటి జ్ఞాపకాలనే కవి ఇష్టంగా గుర్తు చేసుకుంటున్నాడు. ‘గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదు’ అంటూ సీనియర్‌ సముద్రాల మాటలను గుర్తుచేసుకుంటే, ఏడవడంలోనూ ఆ నందం ఉందని చెప్పడం కవులకే సాధ్యం అనిపిస్తుంది. కవులు ఇంతేనేమో! కవి హృదయమం టే ఇదేనేమో! ‘నువ్వు/ రాకున్నా పర్వాలేదు/ కానీ కనీసం నీకోసం/ ఎదురు చూసే చూపు ల్ని/ అడ్డుకోకు‘ ఎంతటి హృద్యమైన విశాలమైన ప్రేమ భావన ఇది. ప్రేమను ఇంతకన్నా గొప్పగా ఎవరు మాత్రం వ్యక్తం చేయగలరు. ఈ రకమైన వ్యక్తీకరణ నేటి సమాజానికి ముఖ్యంగా యువతరానికి చాలా అవసరం. ప్రేమంటే వేధింపు కా దు. వెంటపడడం కాదు. మౌనంగా ఆరాధించ డం. దుఃఖానికి సంబంధించి కూడా ఇందులో అనేక కవితలు ఉన్నాయి. ‘దుఃఖాన్ని తొలగించమని/ దేవున్ని వేడుకున్నాడు మానవుడు-/ శతాబ్దాలు గడిచాయి/ దుఃఖ సముద్రం పెరుగుతూ నే ఉంది/ గుళ్లూ దేవుళ్లూ, కన్నీళ్లూనూ!‘అంటా రు. నేడు విశ్వవ్యాప్తమై ఉన్నది దుఃఖ రసమేనం టూ,‘కవి.. ఆ కన్నీళ్లను కొన్ని/ అక్షరాలపై నిం చి చూడు/ అవి ప్రవహించి వెల్లువెత్తి/ కావ్యమౌతాయి కరుణమౌతాయి!‘ అంటూ కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ సందేశమవుతున్నాడు కవి. ఇలా చెప్తూపోతే ఎన్నో అనుభూతులు… ఎన్నో ప్రత్యేకతలు. సరళత, స్పష్టత, పదాల క్లుప్తత, భావగాఢ త ఆనందచారి రచనాశైలి. కవిత్వం జీవితం రెం డూ పురి అల్లుకొని సాగడం ఆయన కవిత్వపు నడక. ఇందులోని ప్రతి కవితా ఆణిముత్యమే. ఈ కవితల సమాహారం అన్నిభావాల రుచుల భావోద్వేగాలను కళాత్మకంగా అందించిం ఇవి మెరుపు కవితలే కానీ, చదివి మరిచిపో కవితలు మాత్రం కావు. తలపులను మేల్కొ తటి ల్లతలు ఇవి. వాటి భావపు వెలుగు మనలో మిగిలి ఉంటుంది.