Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

Bathukamma Wishes in Telugu: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుగులో.. పూల పండుగ బతుకమ్మకు ప్రత్యేక విషెస్.. మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి

jagan 09 Oct 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Bathukamma Wishes in Telugu: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుగులో.. పూల పండుగ బతుకమ్మకు ప్రత్యేక విషెస్.. మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి

Bathukamma Wishes in Telugu

Bathukamma Wishes in Telugu: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మీయత, ప్రకృతిపై మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే అద్భుతమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే పూలతో పేర్చిన అందమైన ఆకృతి మాత్రమే కాదు. అది తెలంగాణ ఆడపడుచుల ఆనందం, కుటుంబాల ఆత్మీయత, జానపద సంపద, ప్రకృతి ఆరాధన, తెలంగాణ అస్తిత్వం కలిసిన ఒక సజీవ సంప్రదాయం. తరాలు మారినా, జీవనశైలి మారినా బతుకమ్మ పండుగపై ప్రజల ప్రేమ తగ్గడం లేదు. పూల పరిమళాల మధ్య వినిపించే బతుకమ్మ పాటలు తెలంగాణ నేల గొప్పదనాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ప్రకృతిని ప్రేమించడం, సంప్రదాయాలను గౌరవించడం, మనుషుల మధ్య అనుబంధాలను బలపరచడం అనే సందేశాన్ని అందించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ఎప్పటికీ ప్రత్యేకమైన ఆభరణంగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకి పంపుకోవడానికి కొన్ని అందమైన శుభాకాంక్షలు..

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

పూల పండుగ బతుకమ్మ మీ జీవితంలో సంతోషాల వసంతం నింపాలి. బతుకమ్మ శుభాకాంక్షలు!

పూల అందాలు.. పాటల సందళ్లు.. ఆనందాల హరివిల్లు.. మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ మీ కుటుంబంలో సిరిసంపదలు నింపాలి.
ఈ బతుకమ్మ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బతుకమ్మ!

తీరొక్క పూలతో కొలువైన పూల పండుగ, మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
ప్రకృతిని దైవంగా భావించి పూజించే శుభవేళ.. మీ ఇంట సిరిసంపదలు, సుఖసంతోషాలు వికసించాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
బతుకమ్మ పండుగ వేళ ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ.. బతుకమ్మ శుభాకాంక్షల

రంగురంగుల పూల జాతర.. ఆడపడుచుల సంబరం! ఆ గౌరమ్మ తల్లి మీ ఇంట సంతోషాల సిరులు కురిపించాలని ఆశిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
పూల పరిమళాలు మీ జీవితంలో ఆనందాన్ని, గౌరమ్మ తల్లి ఆశీస్సులు మీకు సదా ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

బతుకమ్మ పాటల సందడి, కోలాటాల కోలాహలంతో మీ ఆనందం రెట్టింపు కావాలని ఆశిస్తూ.. తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు!
గుమ్మడి, తంగేడు, గునుగు పూల రంగులతో మీ జీవితం ఎల్లప్పుడూ వర్ణశోభితంగా వెలగాలని కోరుకుంటూ.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

పూల సోయగాలతో, పాటల సందడితో, ఆనందాల వెలుగులతో మీ ఇల్లు నిండిపోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

రంగురంగుల పూలతో బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో.. మీ జీవితం కూడా సంతోషాలు, సిరిసంపదలతో అంతే అందంగా ఉండాలి. బతుకమ్మ శుభాకాంక్షలు!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ మీ జీవితంలో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి బతుకమ్మ శుభాకాంక్షలు!

పూల పరిమళాలు మీ జీవితాన్ని ఆనందమయం చేయాలి. అమ్మవారి ఆశీస్సులతో మీ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరియాలి. హ్యాపీ బతుకమ్మ!

ఆడపడుచుల ఆటపాటలతో, పూల బతుకమ్మల సందడితో మీ ఇంట ఆనందాల పండుగ వెల్లివిరియాలి. మీకు, మీ బంధుమిత్రులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!