Bathukamma Wishes in Telugu: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి మీ బంధువులకు.. పూల పండుగ బతుకమ్మ నాడు మీ బంధుమిత్రులకు పంపేందుకు ప్రత్యేక విషెస్..
Bathukamma Celebrations 2026
Bathukamma Wishes in Telugu: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మీయత, ప్రకృతిపై మనిషికి ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పే అద్భుతమైన పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే పూలతో పేర్చిన అందమైన ఆకృతి మాత్రమే కాదు. అది తెలంగాణ ఆడపడుచుల ఆనందం, కుటుంబాల ఆత్మీయత, జానపద సంపద, ప్రకృతి ఆరాధన, తెలంగాణ అస్తిత్వం కలిసిన ఒక సజీవ సంప్రదాయం. తరాలు మారినా, జీవనశైలి మారినా బతుకమ్మ పండుగపై ప్రజల ప్రేమ తగ్గడం లేదు. పూల పరిమళాల మధ్య వినిపించే బతుకమ్మ పాటలు తెలంగాణ నేల గొప్పదనాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ప్రకృతిని ప్రేమించడం, సంప్రదాయాలను గౌరవించడం, మనుషుల మధ్య అనుబంధాలను బలపరచడం అనే సందేశాన్ని అందించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ఎప్పటికీ ప్రత్యేకమైన ఆభరణంగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులకి పంపుకోవడానికి కొన్ని అందమైన శుభాకాంక్షలు.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండుగ మీ కుటుంబంలో సిరిసంపదలు నింపాలి.
ఈ బతుకమ్మ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బతుకమ్మ!

రంగురంగుల పూల జాతర.. ఆడపడుచుల సంబరం! ఆ గౌరమ్మ తల్లి మీ ఇంట సంతోషాల సిరులు కురిపించాలని ఆశిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!
పూల పరిమళాలు మీ జీవితంలో ఆనందాన్ని, గౌరమ్మ తల్లి ఆశీస్సులు మీకు సదా ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!

బతుకమ్మ పాటల సందడి, కోలాటాల కోలాహలంతో మీ ఆనందం రెట్టింపు కావాలని ఆశిస్తూ.. తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు!
గుమ్మడి, తంగేడు, గునుగు పూల రంగులతో మీ జీవితం ఎల్లప్పుడూ వర్ణశోభితంగా వెలగాలని కోరుకుంటూ.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!