గాంధీ జయంతికి ‘సిగ్మా’
Sigma
సందీప్ కిషన్ హీరోగా, జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న యాక్షన్ అడ్వెంచర్ ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. తొలి రెండు సింగిల్స్ కూడా చాట్‌బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. గాంధీ జయంతి హాలిడేతో పాటు ఆ తర్వాత వికెండ్ కూడా కలిసిరావడంతో ఈ రిలీజ్ డేట్ సినిమాకు మంచి అడ్వాంటేజ్ కానుంది. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్లో సందీప్ కిషన్ ఇంటెన్స్ అవతార్లో కనిపిస్తున్నారు. వార్మ్ లైటింగ్‌తో ఉన్న ఇంటీరియర్‌లో ఓ డాగ్ పక్కన నిలబడి, కిటికీ నుంచి వస్తున్న గోల్డెన్ సన్లైట్ మధ్య కనిపిస్తున్న ఆయన లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్. హరిహరసుతన్ వీఎఫ్‌ఎక్స్ సూపర్వైజర్‌గా పనిచేస్తున్నారు.ప్రస్తుతం పోస్ట్ త్వరలోనే ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.