Sowcar Janaki Passes Away: షావుకారు జానకి గురించి ఎవరికి తెలియని ఆసక్తికర నిజాలు.. నింగికేగిన శంకరమంచి జానకి..
Sowcar Janaki
Sowcar Janaki గా ప్రసిద్ధి చెందిన శంకరమంచి జానకి తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటి. ఆమె మరణంతో దక్షిణ భారత సినీ రంగం ఓ సీనియర్ నటిని కోల్పోయింది.
Sowcar Janaki Passes Away: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తనదైన నటనతో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి ‘షావుకారు’ జానకి (94) కన్నుమూశారు. వయోభారంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరిన ఆమె, శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దక్షిణ భారత నటీనటుల సంఘం (నాదిగర్ సంగమ్) అధ్యక్షుడు నాజర్ అధికారికంగా ప్రకటించారు.
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి షావుకారు జానకి సహజమైన నటన, స్పష్టమైన సంభాషణలు, విభిన్నమైన పాత్రలను అవలీలగా పోషించే సామర్థ్యంతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. అయితే ఆమె సినీ ప్రయాణం వెనుక చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

జానకి అసలు పేరు శంకరమంచి జానకి. 1950లో విడుదలైన షావుకారు చిత్రంతో ఆమె కథానాయికగా సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా విజయంతో ‘షావుకారు జానకి’ అనే పేరు ఆమెకు శాశ్వతంగా మారిపోయింది. అప్పటి నుంచి అసలు పేరుకంటే ఈ పేరుతోనే ఆమెను ప్రేక్షకులు ఎక్కువగా గుర్తించారు.
సినిమాల్లోకి రాకముందే జానకికి కళారంగంతో అనుబంధం ఉంది. ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ప్రతిభను చాటుకున్నారు. రేడియోలో ఆమె చేసిన కార్యక్రమాలు, నాటకాలు ఆమెకు నటనలో అనుభవాన్ని అందించాయి. ఆ అనుభవమే తర్వాత సినిమాల్లో సహజమైన నటనకు ఉపయోగపడింది.
షావుకారు సినిమాలో ఆమెకు కథానాయికగా అవకాశం లభించడం అప్పటి పరిస్థితుల్లోనే పెద్ద విషయం. ఆ చిత్రం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుసగా అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్రశ్రేణి నటిగా ఎదిగారు.
జానకి కెరీర్‌లో ప్రత్యేకత ఏమిటంటే ఆమె కేవలం కథానాయిక పాత్రలకే పరిమితం కాలేదు. వయసుకు తగ్గట్టుగా తల్లి, అత్త, అక్క, బామ్మ, గంభీరమైన కుటుంబ పెద్ద వంటి విభిన్న పాత్రలను కూడా అద్భుతంగా పోషించారు. దీంతో తరాల మారినా ఆమెకు అవకాశాలు కొనసాగాయి. తెలుగు సినిమాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ జానకి నటించారు. దక్షిణ భారత సినీరంగంలో విస్తృతంగా పనిచేసిన నటీమణుల్లో ఆమె ఒకరు. తమిళ ప్రేక్షకుల్లోనూ ఆమెకు మంచి గుర్తింపు లభించింది.
చాలామంది నటీమణులు కథానాయిక పాత్రల తర్వాత సినిమాలకు దూరమవుతారు. కానీ జానకి మాత్రం వయసుకు తగ్గ పాత్రలను స్వీకరిస్తూ తన నటనా ప్రయాణాన్ని కొనసాగించారు. కొత్త తరం హీరోలు, హీరోయిన్లతో కలిసి కూడా నటించారు. దీంతో ఆమె పాత తరం నుంచి కొత్త తరానికి వారధిగా నిలిచిన నటిగా గుర్తింపు పొందారు.
జానకి నటనలో అతి తక్కువ హావభావాలతోనే పాత్ర భావాన్ని ప్రేక్షకులకు చేరవేయడం ప్రధాన బలం. ముఖ్యంగా కుటుంబ కథల్లో భావోద్వేగ సన్నివేశాలు, సహజమైన సంభాషణలు, గంభీరమైన పాత్రల్లో ఆమె చూపిన నటనా పటిమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక హీరోయిన్‌గా మొదలై.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తరతరాల ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయం.షావుకారుతో వచ్చిన పేరు ఆమెకు కేవలం సినిమా టైటిల్‌గా మిగలలేదు.. అదే ఆమె సినీ గుర్తింపుగా మారిపోయింది.
- IMD Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు..
- Using E20 Petrol? E20 పెట్రోల్‌తో వాహనాలకు నష్టం లేదు.. భయపడాల్సిన అవసరం లేదని తెలిపిన పొన్నం ప్రభాకర్
- పారిశుద్ధ్య కార్మికులు…ఈ మరణాలు ఇంకెన్నేళ్లు?
- Delhi PG collapse: నియంత్రణ కోల్పోయిన ‘పిజి’ సంస్కృతి
- Editorial On Forest Rights: అడవిపై హక్కు ఎవరిది ?