1 బిలియన్ వ్యూస్ దాటిన ‘రామాయణ’ ట్రైలర్
Ramayana
రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ: పార్ట్ 1′ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రామాయణ’ ట్రైలర్‌కు అరుదైన ఘనత సాధించింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌కు సినీ అభిమానులు, విమర్శకులు, సెలబ్రిటీలు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ వి ఎఫ్ ఎక్స్ , భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అనే థీమ్ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకుంది. భారతదేశపు గొప్ప ఇతిహాసాన్ని అత్యంత గౌరవంతో, ప్రామాణికంగా, భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ట్రైలర్లో మరో ప్రధాన ఆకర్షణ స్టార్ కాస్టింగ్. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ శక్తివంతమైన నటనతో ఆకట్టుకోగా, రావణుడిగా యష్ తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సీతగా సాయి పల్లవి తన హుందాతనం, అమాయకత్వం, భావోద్వేగాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ స్టార్ కాస్టింగ్ ట్రైలర్‌కు మరో పెద్ద బలంగా మారింది.దీంతో ‘రామాయణ: పార్ట్ 1’ పై అంచనాలు మరింత పెరిగాయి.
1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన రామాయణ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇప్పుడు ‘రామాయణ: పార్ట్ 1’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా, ధర్మ ప్రొడక్షన్స్ నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- Teachers’ Day 2026 Speech Ideas: నేడు టీచర్స్ డే సందర్భంగా మంచి స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నారా..అయితే చక్కటి స్పీచ్ మీకోసం..
- Teachers Day Wishes On September 5: మీ గురువులు, స్నేహితులకు సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా విషెస్ మీ కోసం…
- Happy Teachers Day 2026 Telugu Wishes: మీ బంధుమిత్రులు, స్నేహితులకు టీచర్స్ డే విషెస్ షేర్ చేయండి..
- Happy Teachers Day 2026 Wishes In Telugu: మీ టీచర్లు, స్నేహితులు, బంధు మిత్రులకు Messages, Quotes, Images రూపంలో Whatsapp Status, Facebook కోసం గ్రీటింగ్స్ మీకోసం..
- El Niño 2027 Alert: ప్రపంచానికి పెనుముప్పు తీసుకొస్తున్న చిన్న బాలుడు.. భారీ వర్షాలు, కరువు, తీవ్ర వేడి ముప్పు.. WMO తీవ్ర హెచ్చరిక