NTR Meals Ends: లక్షలాది మందికి ఆకలి తీర్చిన ‘ఎన్టీఆర్ మీల్స్’ సేవలు శాశ్వతంగా నిలిపివేత.. కారణం ఏంటంటే..
Ntr Meals
NTR Meals Ends: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో నిబద్ధతతో, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ మీల్ సేవా కార్యక్రమం ముగిసింది. పేదలు, నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా ప్రారంభమైన ఈ మహత్తర యజ్ఞాన్ని.. శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు శనివారం అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 150కి పైగా ప్రత్యేక కేంద్రాల ద్వారా నిరంతరాయంగా ఎన్టీఆర్ మీల్ కిట్ల పంపిణీ జరిగింది. కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా రవాణా సౌకర్యాలు లేని మారుమూల గ్రామాలకు సైతం కొరియర్ ద్వారా 2 వేలకు పైగా కిట్లను చేరవేసి నిర్వాహకులు తమ సేవా నిరతిని చాటుకున్నారు. ఎందరో నిరుపేదలకు, బాటసారులకు ఈ కార్యక్రమం ఆకలి తీర్చే కొండంత అండగా నిలిచింది.
సేవా కార్యక్రమాలను నిలిపివేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. గతంలో తమ వద్ద నుంచి ఎన్టీఆర్ మీల్ కిట్లను పొందిన లబ్ధిదారులు, వివిధ ప్రాంతాల ప్రతినిధులు వాటిని వీలైనంత త్వరగా తమ ప్రధాన కార్యాలయానికి తిరిగి అప్పగించాలని కోరారు.
కిట్లు పంపాల్సిన చిరునామా:
TVH Ouranya Bay, OMR, Chennai, Tamil Nadu – 603103.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కిట్లను స్వయంగాగానీ లేదా కొరియర్ ద్వారా గానీ పైన పేర్కొన్న చెన్నై చిరునామాకు పంపాలని విజ్ఞప్తి చేశారు.
సాధారణంగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రక్తదాన శిబిరాలు, వరదలు-విపత్తుల వేళ సహాయక చర్యల్లో ముందుంటారు. అదే బాటలో ఎన్టీఆర్ మీల్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అహరహం శ్రమించిన వాలంటీర్లకు, ఈ ప్రయాణంలో సహకరించిన అభిమానులకు మరియు దాతలకు నిర్వాహక బృందం హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.
- IMD Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు..
- Using E20 Petrol? E20 పెట్రోల్‌తో వాహనాలకు నష్టం లేదు.. భయపడాల్సిన అవసరం లేదని తెలిపిన పొన్నం ప్రభాకర్
- పారిశుద్ధ్య కార్మికులు…ఈ మరణాలు ఇంకెన్నేళ్లు?
- Delhi PG collapse: నియంత్రణ కోల్పోయిన ‘పిజి’ సంస్కృతి
- Editorial On Forest Rights: అడవిపై హక్కు ఎవరిది ?