సినిమా చూస్తున్నంతసేపూ మనసు బరువెక్కింది: ‘పళ్ళ బురుసు’ ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున
Pallaburusu
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం. నాన్న ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలను కూడా రూపొందించాం. ఈ 50వ సంవత్సరం సందర్భంగా మా టీమ్ అంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాం. మొన్ననే ‘లెనిన్’ను రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ను విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నా ‘కింగ్ 100’ కూడా రాబోతోంది. కొత్త కథతో ఎవరైనా వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మా టీమ్‌కు కథ నచ్చితే, నేను తప్పకుండా కథ వింటాను. పళ్ళ బురుసు నేపధ్యానికి సంబంధించిన చక్కని కథ. ఆగస్టు 14 మా అమ్మగారి పుట్టినరోజు అందుకే రిలీజ్ చేస్తున్నాము అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత వివేక్ కృష్ణాణి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, డైరెక్టర్ ఉదయ్ చౌహన్ , మురళీధర్ గౌడ్ ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి , ప్రజ్వల్ , గోమతి , మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ , లిరిసిస్ట్ సురేష్ గంగుల పాల్గొన్నారు.
- IMD Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు..
- Using E20 Petrol? E20 పెట్రోల్‌తో వాహనాలకు నష్టం లేదు.. భయపడాల్సిన అవసరం లేదని తెలిపిన పొన్నం ప్రభాకర్
- పారిశుద్ధ్య కార్మికులు…ఈ మరణాలు ఇంకెన్నేళ్లు?
- Delhi PG collapse: నియంత్రణ కోల్పోయిన ‘పిజి’ సంస్కృతి
- Editorial On Forest Rights: అడవిపై హక్కు ఎవరిది ?