నేను మారను…. వాళ్లు మారాలి.. రణబాలి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ
Vijay Devarakonda
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
హైదరాబాద్ లో ఘనంగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిపారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నా. మీరంతా ఈ నెల 16న ఈ సినిమా తప్పకుండా చూడాలి. మీ ఫ్యామిలీకి చూపించాలి. మనం ఎలాంటివి దాటుకుని ఇక్కడి దాకా వచ్చాం. మనలో ఎలాంటి డీఎన్ఏ ఉంది అని తెలుసుకునేందుకు మీరు సినిమా చూడాలి. ఈ చిత్రంలో భాగమవడం గర్వంగా ఉంది. రశ్మిక ఈ ఈవెంట్ కు రానందుకు నా తరుపున సారీ చెబుతున్నా. నెగిటివ్ స్ప్రెడ్ చేసేవాళ్లు తమ జీవితాలు గొప్పగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. నా కలలు, నా శ్రమ వాళ్లకు అనవసరం అనిపిస్తే నేనాగాలా? నా హానెస్టీ వాళ్లకు అహంకారం అనిపిస్తే, నా ఆత్మవిశ్వాసం వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా, నా జర్నీ వాళ్లకు అర్థం కాకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా, నేను మారను. వాళ్లు మారాలి. మీరు కూడా బాగుపడితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా బాగుంటారు. ఇలా వెనక్కి లాగే పనులు చేస్తే ఉపయోగం ఉండదు. కొందరు గ్రూప్ గా మారి ఇలాంటి నెగిటివిటీ తయారుచేస్తుంటారు అన్నారు. దసరా పండక్కి రణబాలి సినిమా మీ ముందుకు వస్తోంది. మనకు ఏ చరిత్ర తెలియకుండా దాచారో, ఏ వీరుల చరిత్ర తెలియకూడదు అనుకున్నారో, ఏ కథలు జానపథాల్లో, బుర్రకథల్లో చెబుతూ మనం మర్చిపోకుండా చేశారో, ఆ చరిత్రను సరిదిద్దే ప్రయత్నం అక్టోబర్ 16న రణబాలి చేయబోతున్నాడు. ఆ వీరులను సెలబ్రేట్ చేసే ప్రయత్నమే మా సినిమా. ఆ బుర్రకథల్ని, చరిత్రను ప్రపంచమంతా చూసేలా బిగ్ స్క్రీన్ మీద ఎక్సిపీరియన్స్ చేసేలా ఆ ప్రపంచంలోకి మీ అందరినీ తీసుకెళ్లేలా రణబాలి ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను. టాక్సీవాలా కథ విన్నప్పుడే రాహుల్ ఎంత సూపర్బ్ రైటర్ అనేది అర్థమైంది. రణబాలి కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వస్తున్న గొప్ప స్క్రిప్ట్ ఇదేనని అనిపించింది. కథే కాదు రణబాలి, జయమ్మ, హెక్టార్..ఇలా ప్రతి క్యారెక్టర్, ఆ ఊరు, మా అమ్మ ఊరైన శింగనమల…ఈ వరల్డ్ అంతా ఎంతో గొప్పగా రాశాడు రాహుల్. ఆ కరువు అనే పాయింట్ ను మన కల్చర్ నుంచి, మాసీ హీరోయిక్ గా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇంత పెద్ద కథ చెబుతూ ఎన్నో లేయర్స్ ను ఒక పర్పస్ కు ముడిపెడుతూ బ్యూటిఫుల్ గా కథ రాశాడు రాహుల్. ఇలాంటి గొప్ప కథ మళ్లీ రాహుల్ రాస్తాడో లేదో తెలియదు. ఈ సినిమా కోసం ఫస్ట్ ప్రొడ్యూసర్ రవి గారు నా దగ్గరకు వచ్చారు. మాస్ ఎలిమెంట్స్ కు ఆయన బాగా ఎగ్జైట్ అవుతారు. ఆ తర్వాత కథ విన్నాను. మనకు రాసిపెట్టి ఉన్న స్క్రిప్ట్స్ మన దగ్గరకు వస్తాయని అంటారు. నేను ఈ సినిమా వరకు రవి గారికి థ్యాంక్స్ చెప్పాలా, రాహుల్ కు థ్యాంక్స్ చెప్పాలా, ఆ విధికి థ్యాంక్స్ చెప్పాలా తెలియడం లేదు. నా కెరీర్ లో రణబాలి ఒక పెద్ద హైలైట్ గా నిలిచిపోతుందని నమ్ముతున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రవిశంకర్ , నవీన్ యెర్నేని, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ పాల్గొన్నారు.