Dhurandhar: ధురంధర్ మూవీ ప్రపంచ రికార్డు.. 2026లో ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లీష్ చిత్రంగా హిస్టరీ క్రియేట్..
Dhurandhar
Dhurandhar: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలు (వ్యూస్) పొందిన నాన్-ఇంగ్లీష్ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. ఈ సంచలన విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ అధికారికంగా వెల్లడించారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అమెరికా, యూకే చిత్రాల తర్వాత అంతర్జాతీయంగా అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచిందని కొనియాడారు. గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఈ సినిమా ఏకంగా 37 మిలియన్ల (3.7 కోట్లు) వీక్షణలను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఏకకాలంలో 22 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్ చార్టులలో ఈ చిత్రం అగ్రస్థానంలో నిలవడం విశేషం.
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ రెండు భాగాల ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 2025 డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం ఘనవిజయం సాధించగా.. ఈ ఏడాది మార్చిలో వచ్చిన సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ భారత్‌లో రూ. 1,000 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
భారతీయ కంటెంట్‌కు అంతర్జాతీయంగా ఆదరణ విపరీతంగా పెరుగుతోందని టెడ్ సరాండోస్ వ్యాఖ్యానించారు. 2024 నుంచి ప్రతీ వారం ఏదో ఒక భారతీయ సినిమా లేదా సిరీస్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 జాబితాలో స్థానం సంపాదించుకుంటోందని ఆయన గుర్తుచేశారు. ‘స్క్విడ్ గేమ్’ లేదా ‘మనీ హీస్ట్’ వంటి భారీ గ్లోబల్ హిట్స్ భారత్ నుంచి ఎప్పుడు వస్తాయని చాలామంది అడుగుతుంటారని, అయితే భారతీయ చిత్రాలు ఇప్పటికే ఆ స్థాయి ఘనతను నిలకడగా సాధిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
- RIMS Adilabad: ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారుల మృతి, విచారణకు సీఎం ఆదేశం
- Chanchalguda Jail: చంచల్‌గూడ జైలు రిమాండ్ ఖైదీ పరార్.. ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి తప్పించుకున్న ఖైదీ శివశంకర్ రెడ్డి
- Bollaram Arms Theft: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక విషయాలు.. నాలుగు నెలల ముందే మల్లేష్ స్కెచ్?
- Telangana New Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లు.. దసరాకు ముందే 2.25 లక్షల మందికి చేయూత
- Jurala Project Water: జూరాల రైతులకు నీళ్లు ఎలా? కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ.. బెంగళూరుకు మంత్రుల బృందం