అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా ‘మహాకాళి’
Akshaye Khanna as Shukracharya in ‘Mahakali’
‘హనుమాన్’ విజయం తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘మహాకాళి’. ‘మహాకాళి ది ఎ్‌ండ బిగిన్స్’కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఆగస్టు 24న రానున్నట్లు ప్రకటించారు.ఆ రోజు ఏ అప్‌డేట్ ఇవ్వబోతున్నారనే విషయాన్ని మాత్రం మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచారు. దీంతో అసలు ఆ రోజు ఏం రివీల్ చేయబోతున్నారనే ఆసక్తి మూవీ లవర్స్‌లో మరింత పెరిగింది.పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌కే దుగ్గల్ సమర్పిస్తున్నారు. రిజ్వాన్ దుగ్గల్ నిర్మిస్తుండగా, ప్రశాంత్ వర్మ షోరన్నర్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆర్ కె డి స్టూడియోస్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కుతోంది.భూమి శెట్టి మహాకాళిగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా కనిపించే ఫస్ట్ లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్
- Land Pooling Policy: తెలంగాణలో కొత్త ల్యాండ్ పూలింగ్ పాలసీ.. భూయజమానులకు నగదు బదులు డెవలప్డ్ ప్లాట్లు..?
- AP Drought Mandals: స్వర్ణాంధ్ర కాదు కరువాంధ్ర.. 21 జిల్లాల్లోని 388 మండలాలు కరువుతో విలవిల.. సీమలోనే అత్యధికం..
- హైదరాబాద్ సిటీకి సరి కొత్త ‘క్యూర్’.. ఒకే ప్రాపర్టీ ఐడీ.. ఒకే బిల్లు.. ఒకే పోర్టల్