‘అ’ ఫస్ట్ లుక్ విడుదల..
Ah First Look
స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్ , ప్రముఖ ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ నిర్మిస్తున్నారు. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘అ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను హీరో అడివి శేష్ ఆవిష్కరించారు. టైటిల్ చుట్టూ ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను పొందుపరిచారు. అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుందని ఈ పదాలు సూచిస్తున్నాయి. ఇక ఫస్ట్ లుక్ ఈ క్యూరియాసిటీని మరింత పెంచింది. రాహుల్ విజయ్ ఓ ప్రదేశంలో చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఈ ఇంటెన్స్ విజువల్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుందని అర్థమవుతోంది.శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
- IMD Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు విస్తారంగా వర్షాలు..
- Using E20 Petrol? E20 పెట్రోల్‌తో వాహనాలకు నష్టం లేదు.. భయపడాల్సిన అవసరం లేదని తెలిపిన పొన్నం ప్రభాకర్
- పారిశుద్ధ్య కార్మికులు…ఈ మరణాలు ఇంకెన్నేళ్లు?
- Delhi PG collapse: నియంత్రణ కోల్పోయిన ‘పిజి’ సంస్కృతి
- Editorial On Forest Rights: అడవిపై హక్కు ఎవరిది ?