Editorial: బిడిఎల్ టెండర్లో ఆశ్రిత పక్షపాతం?
Editorial: బిడిఎల్ టెండర్లో ఆశ్రిత పక్షపాతం?
భారతదేశం గర్వించే క్షిపణి తయారీ సంస్థల్లో రక్షణ రంగ భాసంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) ఒకటి. హైదరా బాద్ నగరంలోని కాంచన్బాగ్లో దీనిని 1970వ దశకంలో స్థాపించారు. ఈ ప్రభుత్వరంగ సంస్థ దేశానికి యుద్ధరంగంలో అవసరమయ్యే ఎన్నో అత్యాధునిక మిస్సైల్సు, అలాగే బ్రహ్మో స్ ను తయారు చేయడంలో అగ్రగామిగా నిలిచింది. బిడిఎల్ను ‘మినీ రత్న’గా పిలుస్తారు. అలాంటి సంస్థ అవసరమైన పరికరాల సేకరణకు సం బంధించిన టెండర్ల వ్యవహారంపై ‘ఇండియన్ ఎక్స్ ‘ప్రెస్’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం పలు ప్రశ్నలను లేవనె త్తుతోంది.
బిడిఎల్ సంస్థ తయారు చేసే క్షిపణులకు అవసరమైన ఆప్టికల్ సైట్స్ సరఫరా కోసం టెండర్ను అయింద్రీ డిఫెన్స్ అడ్వ యిజరీ ప్రైవేటు లిమిటెడ్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయిం చటంపై ఈ కథనం కేంద్రీకృతమైంది. యుద్ధ ట్యాంకుల నుంచి వచ్చే క్షిపణులను కనిపెట్టి, గుర్తించి, లక్ష్యం చేసుకునేందుకు వీలుగా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ వ్యవస్థలో ఆప్టికల్ సైట్ కీలక భాగం.
అవసరమైన విడిభాగాలను ఇతర కంపెనీల నుంచి సేకరించటం మామూలే. అయితే, మూడేళ్ళుగా ప్రభుత్వ రంగం సంస్థల నుంచి వీటిని పోటీ విధానంలో టెండర్ల ద్వారా బిడిఎల్ తీసుకుంటున్నది. తొలిసారిగా ఒక ప్రైవేటు కంపెనీ నుంచి, అదీ ‘సింగిల్ టెండర్’ (ఇతరులెవ్వరూ పాల్గొనకుండా ఒకే కంపెనీకి కట్టబెట్టే) విధానంలో సేకరించాలని నిబంధనలు మార్చడం చర్చ నీయాంశమైంది. పైగా ఆప్టికల్ సైట్స్ సరఫరా చేసేందుకు టెండర్ ఇవ్వాలని భావించిన అయింద్రా కంపెనీ బిడిఎల్ సంస్థ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) సిద్ధార్థ మిశ్రా సతీమణి శాంభవి మిశ్రాకు 95 శాతం వాటా ఉన్నట్లు పత్రికా కథనం వెలు గులోకి తీసుకువచ్చింది. ఆ కంపెనీ నుంచి మాత్రమే వచ్చిన ఏకైక టెండర్ ఆర్థిక పరిశీలన (ఫైనాన్షియల్ ఎవాల్యూయేషన్) దశలో ఉంది. కేవలం ఒకే సరఫరాదారు ఉన్న సందర్భాలలో లేదా అత్య వసరమైతేనే సింగిల్ టెండర్ విధానాన్ని ఆశ్రయిస్తారు. పోటీ లేని ఈ విధానంలో తాజాగా 300 ఆప్టిక్ సైట్ పరికరాల సరఫరా, కనీ సం15 ఏళ్ళు నిర్వహణ, మరమ్మతు షరతులతో అయింద్రీ కంపె నీకి మాత్రమే అనుకూలంగా టెండర్లను పిలిచారు. సుమారు రూ.56.8 కోట్ల విలువైన ఈ టెండర్ను ‘సింగిల్ టెండర్’ విధానం లో ఆ కంపెనీకి కేటాయించారు.
2023లో బిడిఎల్ సిఎండిగా పదవీ విరమణ పొందిన తరువాత సిద్ధార్థ మిశ్రా ఆయన సతీమ ణితో కలిసి చెరి 50 శాతం వాటాతో అయింద్రీ డిఫెన్స్ అడ్వైయి జరీ కంపెనీని స్థాపించనట్లు రికార్డులు చెబుతున్నాయి. 2025లో ఆయన కోల్కత్తా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్లో సాంకేతిక సభ్యుడిగా నియమితుడైన తరువాత కంపెనీలో వాటాలను వదులు కొన్నారు. డైరక్టర్గా ఉన్న ఆయన సతీమణీ వాటా 95 శాతానికి పెరిగింది. కంపెనీ ఆనుపానులు కూడా సందేహాస్పదంగానే ఉన్నా యి. కార్యాలయ అడ్రస్ కూడా తాళాలు వేసినట్లు ఇండియన్ ఎక్సప్రెస్ పరిశీలనలో తేలింది. ఇదంతా కూడా టెండర్ల విష యంలో అనేక అనుమానాలకు, ఆశ్రిత పక్షపాతానికి తావిస్తోంది.
నిజానికి భారతదేశ రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు తక్కువ ఖర్చుతో ప్రపంచంలోనే అద్భుత ఫలితాలను సాధించాయి. ఆది నుంచి బిజెపిది ప్రైవేటీకరణ మంత్రమే. నాటి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ఏకంగా ఒక శాఖనే ఏర్పాటు చేసింది. నేటి మోదీ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. ‘గవర్నమెంట్ హాజ్ ్న బిజినెస్ టు బి ఇన్ బిజినెస్’ (ప్ర భుత్వానికి వ్యాపారం చేయడంలో ఎలాంటి పని లేదు) అని మోదీ పదే పదే పిఎసు ప్రైవేటీకరణ జపం చేస్తుంటారు. ఇప్పుడు మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగం సంస్థలను అగ్గువకే ఆశ్రితు లకు కట్టబెడుతున్నారు. లాభాల్లో ఉన్న పిఎసులను ప్రైవేటు రంగంతో అనుసంధిస్తున్నారు. చివరకు ఇది అంతరిక్ష పరిశోధనా రంగానికి కూడా చేరడంతో ఇస్రో నుంచి పెద్ద ఎత్తున శాస్త్రవేత్తలు రాజీనామా చేస్తున్నారనే వార్తలు దిగ్భ్రాంతికి కలిగించాయి.
నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలంటే వ్యాపార సంస్థలు కావు. ప్రభుత్వ రంగంలో ప్రభుత్వానికి, దేశానికి, ప్రజలకు అవసరమయ్యే ఉత్ప త్తులను అభివృద్ధి చేస్తుంటాయి. వీటిలో ప్రభుత్వం పెట్టుబడి పెడు తుంది. వాటిని ప్రభుత్వం నియమించే డైరెక్టర్లు నిర్వహిస్తుంటారు. పిఎస్యుల ద్వారా లాభాలు ప్రభుత్వానికే రావడమే కాకుండా, వేలాది మందికి గౌరవప్రదమైన ఉపాధి కల్పిస్తుంది కూడా. పిఎస్ యుల ద్వారానే రక్షణ రంగంలో, అంతరిక్షరంగంలో, పారిశ్రా మిక రంగంలో భారతదేశం ఉన్నతి సాధించిన విషయాన్ని మరిచి పోలేము. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఇసిఐఎల్, ఐడిపి ఎల్, బిడిఎల్, ఐడిఎల్, హెచ్ఎల్ఎ వంటి అనేక సంస్థల విజయగా థలను విన్నాం. కానీ, తమ వంధిమాగధులైన పారిశ్రామిక వేత్తలు, గుప్పెడు కార్పొరేట్ల కోసం మోదీ ప్రభుత్వం బంగారుబా తులను కోసేస్తోంది. అందుకే, రక్షణ, అంతరిక్ష రంగాలలో కూడా ప్రైవేటీకరణను జొప్పిస్తోంది. లాభాలను వాళ్ళ జేబుల్లోకి నింపు తోంది. ఒకసారి ప్రైవేటు కంపెనీలు ప్రవేశించిన తరువాత, అవి నీతి, ఆశ్రితపక్షపాతానికి అడ్డూ అదపూ ఉండదని అనేక ఉదం తాలు నిరూపిస్తున్నాయి. తాజాగా ఆంగ్ల దినపత్రిలో ప్రచురితమైన బిడిఎల్కు సంబంధించిన సింగల్ టెండర్ ఉదంతం అదే విషయాన్ని రూఢీ చేస్తోంది.