Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మావిగన్ ను వదలని జగన్…రాజధాని రాజకీయంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి…

Prajapaksham 07 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
మావిగన్ ను వదలని జగన్…రాజధాని రాజకీయంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి…

మావిగన్ ను వదలని జగన్...రాజధాని రాజకీయంపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మళ్లీ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి ఈసారి కూడా రాజధాని విషయంలో అటు అధికార కూటమి ప్రతిపక్ష వైసిపి మధ్య పోటాపోటీ ప్రకటనలు నిప్పు రాజేస్తున్నాయి తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపైన మళ్లీ ప్రస్తావన తెచ్చారు. మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రాంతాలను కలుపుతూ మావిగన్ అని సరికొత్త ప్రత్యామ్నాయం తెరపైకి తెచ్చి ఎన్నికల్లో సైతం ఇదే మెమోరాండం గా జనాల్లోకి వెళతామని ప్రకటించి సంచలనానికి తెర లేపారు. మరోవైపు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సిపి ప్రస్తుత రాజధాని అమరావతి విషయంలో అనేకసార్లు యూ టర్న్ నిర్ణయాలు తీసుకుంది. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించి ఆ తర్వాత ఎన్నికల్లో గెలవగానే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తెచ్చారు చివరకు పరిపాలనా కాలం ముగిసే సమయానికి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందని అది ఏకైక రాజధాని అని ప్రకటించి ఎన్నికలకు వెళ్లారు కానీ చివరకు వైసీపీ పార్టీ మూడు రాజధానుల వ్యూహం బెడిసి కొట్టింది దీంతో అధికారం దూరం అయింది. ఇప్పుడు మళ్లీ రాజధాని అంశం తెరపైకి ఎందుకు తెస్తున్నారు అని వైఎస్ఆర్సిపి పార్టీ వర్గాల్లోనే తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ప్రజల్లో ఎక్కువగా రాజధాని పైన చర్చ లేదని ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి అనేక సమస్యలు ఉన్న అధినేత వైయస్ జగన్ మాత్రం రాజధాని చుట్టూ రాజకీయాన్ని తిప్పడం ఎంతవరకు పార్టీకి మైలేజ్ ఇస్తుంది అనేది ప్రశ్నార్ధకంగా మారిందని వైసిపి పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల ఆ పార్టీ గురించి ఎక్కువగా టెలివిజన్ చర్చల్లో పాల్గొనే విశ్లేషకుడు కేస్ ప్రసాద్, మావిగన్ స్లోగన్ జగన్ మెదడులో పుట్టిన ఆలోచన కాదని ఆయన చుట్టూ ఉన్న కోటరీ సృష్టించిన ఒక కొత్త వ్యూహం అని దీనివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని ఆయన వాపోయారు.

తాడేపల్లి లో ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజధాని ఇష్యూ పైన వైసిపి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు విశాఖపట్నం విషయంలో యూటర్న్ తీసుకున్నటువంటి వైసీపీ ఇప్పుడు మళ్లీ మావిగన్ పేరిట కొత్త ప్రతిపాదన తేవడంపై అటు నెటిజన్లు సైతం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ ప్రాంతంలోనే అమరావతి సైతం ఉంది. సి ఆర్ డి ఏ పరిధి మొత్తం కూడా జగన్ చెబుతున్న మావిగన్ ప్రాంతం పరిధిలోనే ఉంది. ఇలాంటి అప్పుడు మావిగన్ అనే పేరు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏముందని ఆ పార్టీకి చెందిన నేతలే గుసగుసలాడుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ రాజధాని చుట్టూ రాజకీయం తిప్పడం వల్ల ప్రయోజనం ఏముందని కూడా అదే పార్టీకి చెందిన పలువురు నేతలు పొలిటికల్ సర్కిల్స్ లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మావిగన్ ఇష్యూను జగన్ సీరియస్ గా తీసుకున్న ప్రజలు భవిష్యత్తులో అంతే సీరియస్గా తీసుకుంటారో లేదో అనేది తేలాల్సి ఉంది.