Skip to content
జాతీయం › వార్తలు

‘Fear, Anger and Hatred’: ప్రేమను ఎలా వ్యక్తపరచాలో బీజేపీ నేతలకు తెలియదు.. ‘సత్యం శివం సుందరం’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్.. అసలేం జరిగిందంటే?

jagan 17 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
‘Fear, Anger and Hatred’: ప్రేమను ఎలా వ్యక్తపరచాలో బీజేపీ నేతలకు తెలియదు.. ‘సత్యం శివం సుందరం’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్.. అసలేం జరిగిందంటే?

Rahul Gandhi

‘Fear, Anger and Hatred’: తమ ఇంట్లో భోజనం చేసే సమయంలో ప్రేమతో తన తల్లి సోనియా గాంధీ.. తండ్రి రాజీవ్ గాంధీ ఒడిలో కూర్చునేవారని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (BJP-RSS) నేతలు తీవ్రంగా స్పందించడంతో.. వారి విమర్శలపై రాహుల్ గాంధీ గట్టిగా బదులిచ్చారు. భయం, కోపం, ద్వేషం వంటి భావోద్వేగాలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారుల చుట్టూ ఒక బలమైన వలలా అల్లుకుపోయాయని ఆయన ఆరోపించారు.

ప్రేమను చూడకుండా, దానిని వ్యక్తపరచకుండా ఆ వల వారిని నిత్యం అడ్డుకుంటోందని రాహుల్ పేర్కొన్నారు. ఆ సంకెళ్ల నుంచి వారందరినీ విడిపించి, నిజమైన ప్రేమ, అనుబంధంలోని ఆనందాన్ని అనుభవించేలా చేయడం తన రాజకీయ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా పోస్టులో ఆయన ఒక పురాతన శివపార్వతుల ఆలయ శిల్పాన్ని జతచేయడం విశేషం.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత హిమంత బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘క్షమించండి మేడమ్. మీ కుమారుడు మీ వ్యక్తిగత విషయాలను కూడా బహిరంగంగా ప్రస్తావిస్తూ మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మీ జీవితంలో ఇంతటి ప్రత్యేకమైన రోజున కూడా ఆయన తన మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఈ విషయాన్ని దేశం ఎప్పుడో గ్రహించింది. ఇప్పుడు మీరు కూడా గ్రహిస్తారని ఆశిస్తున్నా’ అంటూ విమర్శలు గుప్పించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయ వేదికలపై ప్రస్తావించడంపై బీజేపీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.