ఆకట్టుకునే రచనలు..
‘ఇక చాలు’ అనుకునే పరిస్థితి పాఠకులకు కలగడం రెండు సందర్భాల్లో సాధ్యమవుతుంది. మొదటిది ఒక రచన మరీ నాసిరకంగా లేదా ఏ ఆకట్టుకోలేని విధంగా ఉన్నప్పు రెండోది, ఒక అద్భుతమైన రచ చదివినప్పుడు.
ఈ రెండో భావం కలిగిందంటే జయశంకర్ ప్రసాద్ రాసిన ‘కామయానీ’ వంటి నాటక పుస్తకాన్ని చదివారని అనుకోవచ్చు. ఇది ఒక సం తృప్తి బిందువు. ఏదైనా గొప్ప రచన చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, లేదా చూస్తున్నప్పుడు ఒక దశలో మనసు పూర్తిగా నిండిపోతుంది. ఇక కొత్తది లోపలికి రావాలనిపించదు. మరేదీ అం తగా నచ్చదు. బహుశా అదే సంతృప్తి బిందువు.
జయశంకర్ ‘కామాయనీ’తో పాటు ఆయన నాటకాలన్నిటికీ దాదాపు ఇలాంటి లక్షణమే ఉంది. ‘నా రచనలు చవకబారు వినోదం కోసం కాదు, రసజ్ఞులైన పాఠకుల కోసం’ అన్న ఆయన భావం, వాటిని చదువుతు న్నప్పుడు అవగతమవుతుంది. డాక్టర్ శ్యామ్ సింగ్ శశి రాసిన ‘అగ్నిసాగర్’ కూ అలాంటిదే.
ప్రసాద్ ‘కామయనీ’లోని మనువునే ఆధారంగా చేసుకు న్నా, ఆయన దృష్టి పూర్తి గా భిన్నం. ‘కామయనీ’లో ఆధ్యాత్మిక, మానసిక తత్త్వం ప్రధానమైతే, ‘అగ్నిసాగర్’లో సామాజిక యథార్థం, శోషణ రహిత స మాజం, ఆదివాసీ సంస్కృతి ప్రతిధ్వనిస్తాయి. ఒకే పాత్రను రెండు దృష్టికో ణాలు ఎంత భిన్నంగా చూపించగలవో వాటిని చదివితే అర్థమవుతుంది.
ధర్మవీర్ భారతి రాసిన ‘అంధాయుగ్’ కూడా పాఠకుడిని సంతృప్తి బిందువు కు చేర్చే రచనే. ఇలాంటి ఆకట్టుకునే ర చదివిన తర్వాత, ఇతర రచన లు అంతగా ఆకర్షించవు. కొత్తగా ఏదైనా చదవాలనే ఆత్రం కలగలేదు.
కొ న్ని రచనలు మనం చదవం. అవే మనలోకి ప్రవేశించి, మనం తర్వాత చదివే ప్రతిదాన్నీ చూసే కళ్లను మార్చేస్తాయి.