Skip to content
వినోదం › వార్తలు

షారూక్ ఖాన్ ‘కింగ్’ పోస్టర్‌ రిలీజ్

Prajapaksham 28 Oct 2026 1 నిమిషాల పఠనం వినోదం
షారూక్ ఖాన్ ‘కింగ్’ పోస్టర్‌ రిలీజ్

Poster for Shah Rukh Khan’s ‘King’ released

‘కింగ్’ మూవీ నుంచి కొత్త పోస్టర్ లో యాక్షన్ లుక్‌తో షారూక్ ఖాన్ అద‌ర‌గొడుతున్నారు. పెదాల మధ్య గులాబీ పువ్వు.. నిప్పులు చెరిగే కంటి చూపు.. ఇలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ ‘కింగ్’ కొత్త పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. యాక్షన్, ఎమోషన్స్‌తో పాటు రొమాన్స్‌ టచ్‌తో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో షారుఖ్ ఎలా కనిపించబోతున్నారో ఈ పోస్టర్ ఓ చిన్న గ్లింప్స్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై కొత్త పోస్టర్ మరింత అంచనాలను పెంచుతోంది. భారీ యాక్షన్, పవర్‌ఫుల్ లుక్‌తో ఆకట్టుకుంటోన్న ఈ పోస్టర్.. వెండితెరపై షారుఖ్ ఖాన్‌ను సరికొత్త అవతార్‌లో చూడాలనే ఆసక్తిని అభిమానుల్లో మరింత పెంచుతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కింగ్’ చిత్రం డిసెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో అభిషేక్ బచ్చన్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ , సచిన్ -జిగర్, సచిన్ సాంగ్వి , జిగర్ సరైయ్య సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు.