స్కావెంజర్ల వేతనాల మంజూరుకు మోక్షమెన్నడో?
Prajapaksham
సుధాకర్ ఏవి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, స్టేట్ టీచర్స్ యూనియన్, తెలంగాణ స్టేట్(STUTS)
ఒక్కరోజు వారు రాకపోతే బడి పరిశుభ్రత అస్తవ్యస్తమౌతుంది. పాఠశాలలను, మరుగుదొడ్లను శుభ్రంచేసి చెట్లకు నీరుపోస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరిక లేకుండా ఉపాధ్యాయులు చెప్పే పనులన్నీ చక్కదిద్దే పారిశుద్ధ్య కార్మకుల (స్కావెంజర్ల)కు ఐదు నెలల నుంచి జీతా లు రావటంలేదు. అసలే అరకొర వేతనంతో పనులు చేసే వారికి నెలల తరబడి జీతం రాకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాఠశాలలు, మరుగుదొడ్లు, మూత్రశాలలను శుభ్రం చేయటంతోపాటు చెట్లకు నీరు పోయటం, పాఠశాలల గ్రౌండ్‌ను ఎప్పటికప్పు డు శుభ్రపరచడంతోపాటు ఉపాధ్యాయులు చెప్పే పనులు సైతం చేసేందుకు ప్రత్యేకంగా నిధులను ఇస్తోంది. వాటితో స్కావెంజర్లను నియమించి వారికి ప్రతీ నెల వేతనాలు ఇవ్వాల్సి ఉంది. కాగా 0- మంది విద్యార్థులున్న పాఠశాలలకు నెలకు రూ.3వేలు, 31- మంది విద్యార్థులున్న బడులకు రూ.6వేలు, 101 ఉన్న వాటికి రూ.8వేలు, 251- ఉన్న బడులకు రూ.12 వేలు, 501 గల వాటికి రూ.15వేలు, 750 మందికి పైగా విద్యార్థులుంటే నెలకు రూ.20వేల చొప్పున ఇస్తోంది. దీంతో ఆయా పాఠశాలల్లో ఎంతమంది స్కావెంజర్లను ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా ఉపాధ్యాయులకే వదిలేసింది. దీంతో పాఠశాల ఉన్నంత సేపు బడిలోనే ఉండే విధంగా స్కావెంజర్లతో మాట్లాడి నియమించుకున్నారు. కాగా స్కావెంజర్ వేతనాలు అమ్మ ఆదర్శ పాఠశాలలోని అకౌంట్లలో నిధులు జమవుతాయి. వాటిని డ్రా చేసి స్కావెంజర్లకు అందించాలి.
ఈ ఏడాది బడులు పునఃప్రారంభం నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావడంలేదు. దీంతో అర్ధాకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొందని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.
స్కావెంజర్ల వేతనాలకోసం ప్రతీ నెల వారికి జిల్లా మినరల్ ఫండ్ (ఎండిఎఫ్) నుంచి చెల్లిస్తున్నారు. కాగా, ఈ నిధులు వివిధ ఖనిజాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. వీటిని తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్య, ఆరోగ్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, తదితర అత్యవసరాలకు వినియోగి స్తారు. కానీ ఎండిఎఫ్ ఫండ్ ప్రభుత్వం నుంచి ప్రతీనెల క్రమం తప్పకుండా వచ్చే అవకాశం లేదని అందుకే స్కావెంజర్లకు ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేక పోయామని అధికారులు చెబుతున్నారు. తమ వేతనాలను ఎండిఎఫ్ ఫండ్‌తో ముడిపెట్టకుండా తమకు నెలనెలా జీతాలిచ్చి ఆదుకోవాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు.
ఐదు నెలల నుంచి జీతాలివ్వకపోవడంతో వారు నానా కష్టాలు పడుతున్నారు. చిన్న ఉద్యోగం..తక్కువ జీతం అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు బడిలోనే ఉండడంతో వేరే పని కూడా చేసుకునే అవకాశం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఐదు నెలలుగా అప్పులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొందరు ప్రధానోపాధ్యాయు లు తమ వేతనం నుండి స్కావెంజర్ల వేతనాలు చెల్లిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయమై చొరవ చూపి వారి వేతనాలను అడ్వాన్సుగా ఖాతాలలో జమ చేయాలి.