Skip to content
వినోదం › వార్తలు

‘కల్ట్’ షూటింగ్ పూర్తి

Prajapaksham 05 Oct 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘కల్ట్’ షూటింగ్ పూర్తి

'Cult' shooting wrapped up

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో, హీరోగా నటిస్తున్న చిత్రం ‘కల్ట్’ షూటింగ్ పూర్తి అయింది. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా భారీ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో సంచలనం కాబోతుంది.ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన భారీ సెట్ లో వందలాది మోడల్స్ లతో 40 -50 రోజుల పాటు తెరకెక్కిన కీలక సన్నివేశాలు భారతీయ చలన చిత్రాలకు ధీటుగా రూపొందించబడ్డాయి.
యూత్ లో ప్రత్యేక మైన కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సన్సెషన్ తరుణ్ భాస్కర్ అందించిన మాటలు మరో హైలైట్.తారక్ సినిమా బ్యానర్ పై సందీప్ కాకరాల ఖర్చుకు వెనకాడకుండా అత్యంత భారీగా టెక్నాలజీ తో నిర్మిస్తున్న ఈ కల్ట్ సినిమాలో సినీ దిగ్జలందరూ పాలు పంచుకుంటున్నారు. యానిమల్ లాంటి సినిమా లకు సౌండ్ డిజైన్ చేసిన సచిన్ అందిస్తున్న సౌండ్ డిజైన్ ఒక ప్రత్యేక స్థాయిలో నిలబెట్టింది, విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ, లాంటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 30 కి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.