Skip to content
వినోదం › వార్తలు

శ్రీకాంత్‌ పని చేసినప్పుడు దాసరి గుర్తొచ్చారు.. ప్యారడైజ్ సక్సెస్ మీట్ లో మంచి మోహన్ బాబు

Prajapaksham 28 Sep 2026 0 నిమిషాల పఠనం వినోదం
శ్రీకాంత్‌ పని చేసినప్పుడు దాసరి గుర్తొచ్చారు.. ప్యారడైజ్ సక్సెస్ మీట్ లో మంచి మోహన్ బాబు

Paradise

మీడియా ములాఖాత్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ దర్శకుడిపై భారం వేసి, సినిమాను నిర్మించిన వాళ్లలో ఒకరిద్దరినే చూశా. మా గురువుగారు దాసరి పై కూడా ఇలాగే నిర్మాతలు నమ్మకం పెట్టుకునేవారు. ఇప్పుడు శ్రీకాంత్‌పై సుధాకర్‌ చెరుకూరి అదే నమ్మకం ఉంచారు. సుధాకర్ లాంటి నిర్మాత సినిమా పరిశ్రమకు కావాలి. నిర్మాత ఆయన పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. దర్శకుడు శ్రీకాంత్ ఈ కథని నాకు చాలా ధైర్యంగా చెప్పాడు. చాలా సులువుగా అర్థమయ్యేలాగా అద్భుతంగా చెప్పాడు. నా సుదీర్ఘ సినీ కెరీర్‌లో 500లకు పైగా చిత్రాల్లో నటించాను కానీ, సికంజ మాలిక్‌లాంటి భయంకరమైన చేయడం నా లైఫ్‌లో ఫస్ట్ టైం. నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడని అనుకోలేదు. నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్. మా గురువుగారు దాసరి నారాయణరావు కూడా చాలా టేకులు తీసుకునేవారు. “నువ్వు చేసినవన్నీ బాగున్నాయి. కానీ ఇంకా అద్భుతంగా వస్తుందని” చెప్పేవారు. శ్రీకాంత్ తో పనిచేస్తున్నప్పుడు నాకు మా గురువు గుర్తొచ్చారు. శ్రీకాంత్ ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్. పాత్రని ఆ పాత్రగానే చూశాడు. ఒక నటుడిగా తనలో ఉన్న టాలెంట్‌ని చూసి గర్వించాను. తను దర్శకుడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడు. తను దేశంలోనే టాప్ డైరెక్టర్ అవుతాడు. సినిమా పరిశ్రమ అందరిదీ. ఎవరికి ప్రతిభ ఉంటే వాళ్లని ముందుకు తీసుకెళుతుంది. శ్రీకాంత్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్నారు. హీరో నాని మాట్లాడుతూ నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా విషయంలో అన్ని కొత్తగానే జరిగాయి. ఫిలిం మేకింగ్, లొకేషన్స్ లో సిచువేషన్, ట్రైలర్ లేకపోవడం, రిలీజ్ ముందు ఉండే సిచువేషన్.. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఒక కొత్త సినిమా చేస్తున్నాం, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాం అనుకున్నాం. కానీ ఇలా రెస్పాన్స్ కూడా ఇంత కొత్తగా ఉంటుందని అనుకోలేదు. ఇది నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్. నేను ఎన్నో సినిమాలు చేశాను. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అయిన ఉదయం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. సాయంత్రానికి మిక్స్‌డ్ రెస్పాన్స్‌గా మారిపోతుంది. ‘ప్యారడైజ్’ కి రివర్స్ లో జరిగింది. రిలీజ్ రోజున ప్రీమియర్స్‌కి ఒకలాగా మొదలైంది. ఆ తర్వాత ప్రతి షోకి పాజిటివిటీ పెరుగుతుంది, ఇంకా బెటర్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి రెస్పాన్స్‌ని నేను చూడలేదు. మేమందరం చాలా నిబద్ధతతో ఈ సినిమా చేశాం అని చెప్పారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ మోహన్ బాబు తో పని చేయడం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుగా భావిస్తాను. ఆయన నుంచి పర్సనల్‌గా చాలా విషయాలు నేర్చుకున్నాను. సుధాకర్ ప్రొడక్షన్ హౌస్‌కి కోవిడ్ సమయంలో వచ్చాను. ఇంకా ఇక్కడే ఉండిపోయాను. నేను ఏం ఫీల్ అవుతానో ఆయనకి క్లియర్‌గా అర్థమవుతుంది. నన్ను భరించినందుకు ఆయనకి థాంక్యూ. నాని అన్నది నాది ‘దసరా’, ‘ప్యారడైజ్’ సినిమాలకు సంబంధించిన అనుబంధం కాదు. మా ఎమోషన్‌ని సినిమాలతో ముడి పెట్టకూడదు. కచ్చితంగా ఆయన నన్ను భరించాలి. ఆయన నన్ను మోయాలి. మరో ఆప్షన్ లేదు. మా ఇద్దరి అనుబంధం ఇక్కడితో ఆగిపోయేది కాదు అని అన్నారు.