Skip to content
వినోదం › వార్తలు

సంజయ్ గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. ‘సిగ్మా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి

Prajapaksham 28 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
సంజయ్ గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.. ‘సిగ్మా’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి

Sigma pre release Event

సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సిగ్మా’. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫారియా అబ్దుల్లా హీరోయిన్. ప్రతిష్టాత్మక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఈ దర్శకుడు జేసన్ సంజయ్ తాత నాకు ‘చట్టానికి కళ్లులేవు’, ‘దేవాంతకుడు’ లాంటి అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు. ఆయన మనవడు డైరెక్ట్ చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఈ వేడుకకు రావాలనిపించింది. అలాగే విజయ్ సినిమాలకు కూడా మేము ముహూర్తానికి వెళ్లడం జరిగింది. సంజయ్‌ని చూస్తే విజయ్‌ని చూసినట్టుగా ఉంటుంది. తను ఎందుకు హీరో కాకూడదు అని అడిగినప్పుడు, నాకు దర్శకత్వం, రచన అంటే ఇష్టం అని చెప్పాడు. అది వాళ్ల తాత, నాన్నామ్మ ద్వారా వచ్చుంటుంది. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ జేసన్ సంజయ్ మ్యూ, సంగీత దర్శకుడు తమన్ నిర్మాత నవీన్ ఎర్నేని, హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు,