సిగ్మా’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి
సందీప్ కిషన్ యాక్షన్-అడ్వెంచర్ ‘సిగ్మా’ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, సీడెడ్ ప్రాంతంలో ఎన్వీఆర్ సినిమా విడుదల చేస్తుంది. తాజాగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మోసపోయిన హీరో, జరిగిన దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్లకుండా.. తనకు జరిగిన నష్టాన్ని తిరిగి సాధించుకోవాలని పోరాటం మొదలుపెడతాడు. డ్రగ్స్, గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన రూ.500 కోట్ల భారీ రాకెట్ ఈ కథలో కీలకంగా ఉంటుంది. దీంతో హీరో క్రైమ్, మోసం, ప్రమాదాలతో కూడిన ప్రపంచంలోకి అడుగుపెడతాడు.మరోవైపు ఓ ఆర్‌జేతో ప్రేమలో ఉన్న హీరో.. తన స్నేహితుల సహాయంతో భారీ హీస్ట్‌కు ప్లాన్ చేస్తాడు. అయితే ఎంతో పక్కాగా వేసుకున్న ఆ ప్లాన్‌కు రెడ్డి అడ్డుపడటంతో మొత్తం ఆపరేషన్ గందరగోళంగా మారుతుంది. ఓటమిని అంగీకరించని హీరో మరింత బలంగా తిరిగి వచ్చి.. అన్ని అడ్డంకులను అధిగమించి తన లక్ష్యాన్ని ఎలా సాధించాడనేది ఆసక్తికరంగా మారింది.సందీప్ కిషన్ కు జోడిగా ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. రాజు సుందరం, సంపత్,. శివ పండిట్, అన్బు తాసన్, యోగ్ జపీ కీలక పాత్రల్లో కనిపించారు.కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ఎస్. థమన్ సంగీతం అందించారు.
- HIV Treatment Update: HIV చికిత్సలో కీలక ముందడుగు.. రోజూ టాబ్లెట్లకు బదులు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్..
- సిగ్మా’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి
- జడల్ లాంటి క్యారెక్టర్ తెలుగు సినిమాలో రాలేదు.. మీడియా చిట్ చాట్ లో హీరో నాని
- ఆధిపత్య ఆరాటంతో ఆందోళనలు… పక్కదారి పడుతున్న ప్రజాసమస్యలు
- జనజీవితాలను మెరుగుపరచని జిడిపి పెరిగితేనేం, తగ్గితే ఏమిటి!