జడల్ లాంటి క్యారెక్టర్ తెలుగు సినిమాలో రాలేదు.. మీడియా చిట్ చాట్ లో హీరో నాని
Nani
నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
నా కెరీర్ స్టార్ట్ అయిందే సెప్టెంబర్ లో. ‘అష్టా చమ్మా’ సెప్టెంబర్‌లోనే రిలీజ్ అయింది. ‘భలే భలే మగాడివోయ్’ కూడా సెప్టెంబర్‌లోనే వచ్చింది. ఇప్పుడు ఆ హిట్ సెంటిమెంట్ ‘ప్యారడైజ్’కి వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నాను.కథలో నుంచి వచ్చిన లుక్ అది. నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు అన్నీ బాగా రిలేటబుల్‌గా, తెలిసిన ఒక పర్సన్ లాంటి ఫీలింగ్ వచ్చే రోల్స్. ఇందులో క్యారెక్టర్ మాత్రం జనరల్ సొసైటీలో పెరిగిన వ్యక్తి కాదు. అది ఏంటి అనేది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది. ఆ క్యారెక్టర్‌కి బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్ ఒక షాక్ వాల్యుతో చూస్తారు. నిజానికి తెలుగులోనే ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్త. నా మీద ఆ క్యారెక్టర్ ఇంకా ఫ్రెష్‌గా ఉంటుంది.ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమా ఇది. మదర్-సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమా నుంచి ఏమైతే ఆశిస్తారో అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు.శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే మోహన్ బాబు అయితే బాగుంటుంది అని అన్నాడు. కాకపోతే ఆయన ఈ క్యారెక్టర్ చేస్తారా లేదా అనేది నాకు డౌట్. ఎందుకంటే చాలా నెగిటివ్, బ్రూటల్ క్యారెక్టర్. శ్రీకాంత్ కథ చెప్పడానికి మోహన్ బాబు దగ్గరికి వెళ్లాడు. ఆయన చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఈ కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మిన మొదటి వ్యక్తి మోహన్ బాబు. ఇందులో విలన్‌గా ఆయన చేసే కొన్ని పనులు ఉంటాయి. అవన్నీ చూసి ఆడియన్స్ కచ్చితంగా షాక్ అవుతారు.మేము ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ చేశాం. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హోల్డ్ చేసి పట్టుకెళ్లే అవకాశం ఈ సినిమాతో వచ్చింది. వందకి రెండింతలు చేశాడు. శ్రీకాంత్-అనిరుధ్ కిల్లర్ కాంబినేషన్. వాళ్ల వల్లే ‘ఆయా షేర్’, ‘ఏషు నాగుల కట్ట’ లాంటి సాంగ్స్ సాధ్యమయ్యాయి.శ్రీకాంత్ దృష్టిలో నేను పెద్ద డ్యాన్సర్‌ని . నివ్వు డ్యాన్స్ చేస్తే మస్తు ఉంటది అన్న అని చెప్తుంటాడు. నేను డ్యాన్స్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తాడు. శ్రీకాంత్ కోసం చేయాలనుకున్నాను. తన నమ్మకం నిజమైంది. పాటలు రిలీజ్ అయిన తర్వాత అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేను ఎంజాయ్ చేశాను. ఇందులో రెండు పాటలు డ్యాన్స్ కూడా సినిమా నుంచి దూరంగా వెళ్లి చేసినట్టుగా ఉండదు. అది సిట్యువేషన్‌గా ఉంటుంది.‘ప్యారడైజ్’ అనే ప్లేస్‌లో సవారి అనే ఒక ట్రైబ్‌కు సంబంధించిన కథ ఇది. అక్కడ సవారీలకు గుర్తింపు లేదు. వాళ్ల ఉనికిని కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్లని చంపేసినా సరే కేసు కూడా పెట్టరు. ఐడెంటిటీ కోసం చేసిన ఒక తిరుగుబాటు. 1984-85 టైమ్‌లైన్ మధ్య ఉంటుంది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ ప్రాంతాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే అక్కడ చూపించిన వరల్‌్పకి మనం రిలేట్ అవుతాం. ఇందులో ఉన్న ‘ప్యారడైజ్’ కూడా అలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. అలా రిలేట్ చేసుకునే ఫీలింగ్ ఇస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్యారడైజ్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ప్యారడైజ్ ప్రపంచంలో లీనమైపోతారు.శ్రీకాంత్ ఒక ఆడియన్‌గా మాస్ కమర్షియల్ మూమెంట్‌్పని ఎంజాయ్ చేస్తాడు. తను ఏం చేసినా సరే తెలియకుండానే థియేటర్‌లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనే చూస్తాడు. మానిటర్లు చూస్తున్నప్పుడు థియేటర్‌లో దీనికి రియాక్షన్ వస్తుందనిపించినప్పుడే టేక్ ఓకే చేస్తాడు. ఏదైనా సీన్ బాగా వచ్చిన రోజు నా దగ్గరికి వచ్చి ‘థియేటర్ ఊగిపోద్దన్న’ అంటాడు. అది తన నమ్మకం. తను మాస్‌ని ఒక దైవంలాగా భావిస్తాడు. శ్రీకాంత్ నరనరాల్లో మాస్ ఉంది. ఆ మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది.ఇందులో ఒక రెండు ఎపిసోడ్లు చాలా రాడికల్‌గా తీశాడు. నా ఫేవరెట్ ఎపిసోడ్స్. ఆడియన్స్ చూసి చాలా సర్‌ప్రైజ్, షాక్ అవుతారు
- HIV Treatment Update: HIV చికిత్సలో కీలక ముందడుగు.. రోజూ టాబ్లెట్లకు బదులు 8 వారాలకు ఒకసారి ఇంజెక్షన్..
- సిగ్మా’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి
- జడల్ లాంటి క్యారెక్టర్ తెలుగు సినిమాలో రాలేదు.. మీడియా చిట్ చాట్ లో హీరో నాని
- ఆధిపత్య ఆరాటంతో ఆందోళనలు… పక్కదారి పడుతున్న ప్రజాసమస్యలు
- జనజీవితాలను మెరుగుపరచని జిడిపి పెరిగితేనేం, తగ్గితే ఏమిటి!