ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్
Upendra's first look released.
హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో పాన్-ఇండియా విజయం సాధించిన సూపర్ హీరో తేజ సజ్జ, ప్రస్తుతం ‘జాంబీ రెడ్డి 2 NXT LVL’ గా వస్తున్న ‘జోంబీ రెడ్డి’ సెకెండ్ పార్ట్‌లో నటిస్తున్నారు. ‘జాంబీ రెడ్డి’ క్రియేటర్ ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకుడిగా చేస్తున్నారు. ‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ప్రశంసలు అందుకున్న ప్రాజెక్ట్‌తో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్లోకు రచయితగా పనిచేసిన సుపర్ణ్ ఎస్. వర్మ.. ఈ ఫ్రాంచైజ్‌కు తనదైన ఇంటెన్స్ టచ్‌ను తీసుకొస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన్ప టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో ‘మిరాయ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘జాంబీ రెడ్డి 2’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా.. షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఉపేంద్రను ఇంతకుముందెన్నడూ చూడని వైల్డ్, ఫియర్స్, లార్జర్ దెన్ లైఫ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. భారీ చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ.. ఒక చేతిలో పొడవైన ఆయుధాన్ని పట్టుకుని కనిపించారు. రఫ్ లుక్, విరబోసుకున్న జుట్టు, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్తో ఈ క్యారెక్టర్ ఎవరు? అనే ఆసక్తిని పెంచుతున్నారు.
- Gurugram Spa Raid: స్పా సెంటర్ల మాటున వ్యభిచారం.. మాల్ లోపల సీన్లు చూసి ఖంగుతిన్న పోలీసులు.. గురుగ్రామ్‌లో 18 స్పాలపై రైడ్..
- Sea vs Ocean: సముద్రం vs మహాసముద్రం.. ఇవి రెండు ఒకటి కాదు.. రెండు పదాల మధ్య తేడా తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..
- Petrol Pump UPI Rules: పెట్రోల్ పంప్ డీలర్లు సంచలన నిర్ణయం.. రూ.2,000 దాటితే UPI పేమెంట్స్ బంద్.. అక్టోబర్ 15 నుంచి అమలు?
- Russia Sanctions Bill: ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యా ఆంక్షల బిల్లుపై సంతకం, భారత్-చైనాకు 100% టారిఫ్ ముప్పు
- Hyderabad Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. వినాయక నిమజ్జనం నుంచి తిరిగి వస్తుండగా విషాద ఘటన..