‘కమల రెడ్డి’గా రమ్యకృష్ణ
ramya krishnan
మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్‌పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్‌తో యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ పాత్ర పేరు కమల రెడ్డి. నటి రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ‘డేవిడ్ రెడ్డి‘ సినిమా నుంచి ఆమె బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ పోస్టర్ లో ఆమె ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి తన ఆసనంపై కూర్చుని ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో కమల రెడ్డి పాత్ర ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా గుర్తుండిపోనుంది. మంచు మనోజ్, మరియా ర్యబోషప్క, రమ్యకృష్ణ, ఆర్. పార్తీబన్, కాంచన, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఒపి ఆచార్య వేణు, మ్యూజిక్ రవి బస్రూర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కొట్టు రవికుమార్
- Telangana Assembly Session: 22ఏ సమస్య ఒక్కరోజులో పుట్టింది కాదు..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన సమస్య .. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి..
- Hyderabad Water Crisis: నీటి సంక్షోభం దిశగా హైదరాబాద్.. భారీగా పడిపోయిన గ్రౌండ్‌వాటర్ లెవల్స్..ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం
- Telangana Assembly Session: ఆ ప్రైవేటు భూములను వెంటనే నిషేధిత జాబితా నుండి బయటకు తీసుకురండి.. ప్రభుత్వానికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక సూచన
- Telangana Assembly Session: కోటి ఎకరాలు అనేది అవాస్తవం.. సెక్షన్ 22-Aపై కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు.. ఏడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..
- UPI Transaction Rules: కొత్త UPI ట్రాన్సాక్షన్ రూల్స్.. కస్టమర్లకు ఛార్జీలు పడతాయా? NPCI FAQలో కీలక సమాధానాలు