Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Vijaya Sai Reddy: వైసీపీకి విజయసాయి రెడ్డి రూపంలో మళ్లీ సెగ…నేడు విజయవాడలో విసా రెడ్డి ప్రెస్ మీట్…కొత్త పార్టీకి తెర లేపుతున్నారా…?

Krishna Rao 07 Sep 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Vijaya Sai Reddy: వైసీపీకి విజయసాయి రెడ్డి రూపంలో మళ్లీ సెగ…నేడు విజయవాడలో విసా రెడ్డి ప్రెస్ మీట్…కొత్త పార్టీకి తెర లేపుతున్నారా…?

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి బిగ్ టర్నింగ్ పాయింట్‌కు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సొంతంగా నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నారా..అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన సోమవారం, విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు ప్రత్యేక ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. వైఎస్సార్‌సీపీ కోటరీపై తీవ్ర స్థాయిలో తిరుగుబాటు జెండా ఎగిరేసిన ఆయన, కొత్త రాజకీయ పార్టీతో పాటు సొంతంగా ఒక డిజిటల్ నెట్‌వర్క్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ దిశగా తిప్పబోతోంది అనేది ఇఫ్పుడు పెద్ద ప్రశ్నగా మారనుంది.

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అంతటా ఒకటే తీవ్రమైన హాట్ టాపిక్ నడుస్తోంది. సీనియర్ రాజకీయ నేత, ఒకప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? ఏపీ రాజకీయ వేదికపై సరికొత్త ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? అసలు గతంలో జూన్ నెలలోనే రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానంటూ చెప్పిన ఆయన, దాదాపు మూడు నెలల పాటు సైలెంట్‌గా ఉండి తెరవెనుక ఎలాంటి వ్యూహాలు రచించారు? ఇటీవల హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి వైఎస్సార్‌సీపీ కోటరీపై అత్యంత ఘాటుగా విరుచుకుపడడం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? విజయసాయి రెడ్డి వేసిన ఈ అడుగులు వైఎస్సార్‌సీపీ అధినాయకత్వానికి ఎటువంటి కోలుకోలేని దెబ్బ కాబోతున్నాయి? ప్రస్తుతం ఏపీలోని ప్రతి పొలిటికల్ ఎనలిస్ట్‌ను, సామాన్య ప్రజలను కూడా ఇవే ప్రశ్నలు తీవ్రంగా వెంటాడుతున్నాయి.

విజయసాయి రెడ్డి ప్రకటనతో ఏపీ పొలిటికల్ ల్యాండ్‌స్కేప్‌లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సోమవారం మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాలకు విజయవాడలోని ప్రతిష్టాత్మక లెమన్ ట్రీ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్తు, రాబోయే ప్రణాళికలపై ఈ సమావేశంలో అత్యంత కీలకమైన సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల విధానాలు, ఆచరణలు సామాన్యుడి ఆకాంక్షలను, వాస్తవ ప్రయోజనాలను ప్రతిబింబించడంలో ఎలా కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాయో ఆధారాలతో సహా వివరిస్తానంటూ పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే ఒక స్ట్రాంగ్ ప్రత్యామ్నాయ రాజకీయ విధానం ఏపీకి ఎంతైనా అవసరమని, ఆ విషయాన్ని స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో మీడియా ముందు ఉంచుతానంటూ వెల్లడించారు.

విజయసాయి రెడ్డి వ్యూహం ఏంటి..?
అసలు విజయసాయి రెడ్డి వైఎస్సార్‌సీపీకి అత్యంత విశ్వసనీయమైన నేతగా, పార్టీకి పిల్లర్‌గా వ్యవహరించిన రోజులను ఎవరూ మర్చిపోలేరు. కానీ గత కొంతకాలంగా పార్టీలోని ఒక నిర్దిష్టమైన కోటరీ ఆయనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టడం, పార్టీ నిర్ణయాల్లో ఆయన పాత్రను తగ్గించడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. జూన్ నెలలోనే కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందంటూ చెప్పినప్పటికీ.. తెరవెనుక లీగల్ ప్రాసెస్, డిజిటల్ నెట్‌వర్క్ ఎస్టాబ్లిష్‌మెంట్, డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్ బలాబలాల అంచనా కోసం ఈ మూడు నెలల సమయం తీసుకున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

గతవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన, వైఎస్సార్‌సీపీలో ముఖ్య నేతలపై, కోటరీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ పార్టీ నేతలను చీల్చి చెండాడడం ఏపీ రాజకీయాల్లో ఒక బిగ్ షాక్‌గా మారింది. ఈ విమర్శలకు మరుసటి రోజే వైఎస్సార్‌సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ఇకపై విజయసాయి రెడ్డి గురించి తమ పార్టీకి చెందిన ఏ ఇతర నాయకులు మాట్లాడరంటూ స్పష్టం చేశారు. అయితే శనివారం విజయసాయి రెడ్డి నుండి వచ్చిన ఈ సంచలన ప్రకటనతో వైఎస్సార్‌సీపీ క్యాంప్‌లో తీవ్ర కలకలం మొదలైంది.

విజయసాయి రెడ్డి ఇంపాక్ట్ వైఎస్సార్సీపీపై ఎలాంటి ప్రభావం చూపే ఛాన్స్ ఉంది..?
విజయవాడ మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి వైఎస్సార్‌సీపీపై, అలాగే ఆ పార్టీ ముఖ్యనేతలపై మళ్లీ విమర్శల బాణాలు సంధించడం ఖాయమంటూ ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడమే కాకుండా, రాబోయే రోజుల్లో తన పొలిటికల్ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఒక సపరేట్ డిజిటల్ మీడియా వ్యవస్థను, న్యూస్ నెట్‌వర్క్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ విజయసాయి రెడ్డి గనుక పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ పార్టీతో రంగంలోకి దిగితే, అది వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకుపై, క్యాడర్‌పై అత్యంత తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుందంటూ పొలిటికల్ ఎనలిస్ట్‌లు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి విజయసాయి రెడ్డి చేసిన ఈ మాస్టర్ స్ట్రోక్‌తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ఆసక్తికరమైన, ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయంటూ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.