Skip to content
వినోదం వార్తలు

Chiranjeevi Kaaka Teaser Video: కాక పుట్టిస్తున్న చిరంజీవి..కాకా టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ (టీజర్ వీడియో)

Prajapaksham 24 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
Chiranjeevi Kaaka Teaser Video: కాక పుట్టిస్తున్న చిరంజీవి..కాకా టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ (టీజర్ వీడియో)

Chiranjeevi Kaaka Teaser Video: మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న చిరంజీవి 158వ సినిమాకు నామకరణం చేశారు. వెంకట్‌ కే నారాయణ నిర్మాణ సారధ్యంలో కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను చిరంజీవి వేడుకల సందర్భంగా శనివారం రిలీజ్‌ చేశారు. ఈ టైటిల్‌ గ్లింప్స్‌ స్టైల్‌, యాక్షన్‌, రా మాస్‌ అప్పీల్‌తో ఆ అంచనాలను మరింత పెంచింది.

కె. సత్యం, సూపర్‌వైజర్‌గా చిరంజీవి ఆక్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గ్లింప్స్‌ ప్రారంభమవుతుంది. సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ తన డైనమిక్‌ విజువల్‌ లాంగ్వేజ్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు. ప్రారంభ సన్నివేశాల్లో కెమెరా దాదాపు చిరంజీవి పాత్రతో పాటు ప్రయాణిస్తున్నట్టుగా ఇమ్మర్సివ్‌ ఫీల్‌ను కలిగిస్తుంది. ఆ తర్వాత గ్లింప్స్‌ ముందుకు వెళ్లే కొద్దీ హై ఎనర్జీ ఫ్రేమ్స్‌, మాస్‌ ఎలివేషన్స్‌తో విజువల్స్‌ ఆకట్టుకున్నాయి. ఎస్‌. థమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గ్లింప్స్‌ ఇంటెన్సిటీని మరింత పెంచింది. ‘గ్యాంగ్‌ లీడర్‌’లోని ఐకానిక్‌ ‘గ్యాంగ్‌ గ్యాంగ్‌’ పాటను రీమిక్స్‌ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్‌ రూబెన్‌, రచయితలుగా కోన వెంకట్‌, కె. చక్రవర్తి రెడ్డి, హరి మోహన కృష్ణ, వినీత్‌ పొట్లూరి పనిచేస్తున్నారు. భాను డైలాగ్స్‌ అందిస్తున్నారు. 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మెగాస్టార్‌ చిరంజీవి, అనశ్వర రాజన్‌, నివేదా పేతురాజ్‌, సునీల్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: లోహిత్‌, ఎడిటర్‌: ఆంటోనీ రూబెన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, స్క్రీన్‌ ప్లే రైటర్స్‌: కోన వెంకట్‌, కె చక్రవర్తి రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శరణ్య పోట్ల, యాక్షన్‌: రామ్‌ – లక్ష్మణ్‌, నబకాంత్‌ డైలాగ్స్‌: భాను-నందు, అడిషినల్‌ స్క్రీన్‌ ప్లే రైటర్స్‌: హరి మోహన కృష్ణ, వినీత్‌ పొట్లూరి.

కాక టీజర్ ఇక్కడ చూడండి..

ట్యాగ్‌లు: Chiranjeevi