బ్యాడ్ టైం బ్యాండ్ బాజా పాడుకుంటున్న అల్లరి నరేష్
Allari Naresh
కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు.తాజాగా బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్ రిలీజ్ చేశారు. ‘బ్యాడ్ టైం బ్యాండ్ బాజా’ పేరుకు తగ్గట్టుగానే పాట ఆద్యంతం ఫుల్ ఎనర్జీ, ఫన్‌తో సాగుతుంది. హీరో జీవితంలో ఎదురయ్యే బ్యాడ్ టైమ్‌ను కామెడీగా ప్రజెంట్ చేస్తూ, క్యాచీ ట్యూన్‌తో పాటను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ ట్యూన్‌కు రామ్ మిరియాల తన ప్రత్యేకమైన వాయిస్‌తో మరింత జోష్ తీసుకొచ్చారు.భాస్కరభట్ల రవికుమార్ అందించిన లిరిక్స్ పాటలోని కామెడీ, ఫన్ ఎలిమెంట్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నాయి.రంభ ఊర్వశి మేనక గా రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ ప్రజెన్స్ ఆకట్టుకుంది. రామ్ మిరియాల ఎనర్జిటిక్ వోకల్స్, భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అల్లరి నరేష్, సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఎడిటర్: చోటా కె. ప్రసాద్.