‘మనసా వాచా’ ఆనంద్ దేవరకొండ
Manasa Vacha
యువతను ఆకట్టుకునే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ నుంచి మూడో పాట ‘మనసా వాచా’ విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటకు దిగ్గజ గాయనీమణి కె. ఎస్. చిత్ర, ప్రముఖ గాయకుడు ఎస్. పి. చరణ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మధురమైన స్వరకల్పనకు చిత్ర, చరణ్‌ల భావోద్వేగభరితమైన గానం తోడవడంతో ‘మనసా వాచా’ ఓ అద్భుతమైన సంగీత అనుభూతిగా నిలిచింది.శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈ పాటలో కథానాయకులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పోషించిన పాత్రల మధ్య ప్రేమ, అనుబంధం, వారి మనసుల్లో చోటుచేసుకునే భావోద్వేగాలను ఎంతో అందంగా ఆవిష్కరించారు. పాటకు అనుగుణంగా తెరకెక్కించిన విజువల్స్ కూడా ఆ భావోద్వేగాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ, వారి ప్రేమ ప్రయాణంలోని సున్నితమైన కోణాలను ఆవిష్కరిస్తున్నాయి.ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
- Independence Day 2026: ఆగస్టు 15, 1947న గాంధీజీ ఎక్కడ ఉన్నారు.. తొలి స్వాతంత్ర్య వేడుకలకు ఎందుకు దూరంగా ఉన్నారు..
- అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. లండన్ నుంచే హైదరాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి
- ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో జగమే సంగీతం
- ‘మనసా వాచా’ ఆనంద్ దేవరకొండ
- అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా ‘మహాకాళి’