నా యవ్వనం, పడకగది గురించి ఊహల్లో తేలిపోవద్దు.. బాబా రామ్‌దేవ్‌కు కంగనా రనౌత్ ఘాటు కౌంటర్
Kangana Ranaut vs Baba Ramdev
Kangana Ranaut vs Baba Ramdev: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురు బాబా రామ్‌దేవ్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. కంగనా రనౌత్ ఇటీవల చేసిన జనరేషన్ గట్టర్ వ్యాఖ్యలను రామ్‌దేవ్ విమర్శించడంతో.. ఆమె సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితం, గతం గురించి వ్యాఖ్యానించవద్దంటూ హెచ్చరించారు.
ఇటీవల కంగనా రనౌత్ కొందరు యువత, మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వారిని జనరేషన్ గట్టర్ అంటూ విమర్శించారు. జంతర్ మంతర్‌లో జరిగిన నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలపై స్పందిస్తూ.. యువత ప్రవర్తన, భాష, జీవనశైలిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది.
ఈ వివాదంపై స్పందించిన బాబా రామ్‌దేవ్.. యువత మొత్తాన్ని గట్టర్ జనరేషన్ గా అభివర్ణించడం సరికాదని వ్యాఖ్యానించారు. కంగనా గతం, ఆమె వ్యాఖ్యలపై ప్రశ్నలు లేవనెత్తుతూ.. ఇలాంటి వ్యాఖ్యలు ‘కలుషితమైన మనస్తత్వానికి’ సంకేతమని విమర్శించారు. రాజకీయ పార్టీ కూడా ఈ వ్యాఖ్యలను గమనించాలని సూచించారు.
దీంతో రామ్‌దేవ్ వ్యాఖ్యలకు కంగనా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా స్పందించారు. బాబాజీ.. నా జవానీ లేదా బెడ్రూమ్ గురించి కలలు కనొద్దు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత జీవితం గురించి కేవలం పుకార్లు, గాసిప్ ఆధారంగా అంచనాలు వేయడం సరికాదని అన్నారు.
అంతేకాకుండా.. తనకు క్యారెక్టర్ గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కంగనా పేర్కొన్నారు. తన వ్యక్తిత్వం రామ్దేవ్దానికంటే మెరుగైనదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రామ్‌దేవ్, పతంజలికి సంబంధించిన 2024 నాటి సుప్రీంకోర్టు వివాదాన్ని కూడా ప్రస్తావించారు. తప్పుడు లేదా మోసపూరిత వైద్య ప్రయోజనాల ప్రకటనల విషయంలో తనకు ఎప్పుడూ సుప్రీంకోర్టు నుంచి మందలింపు రాలేదని కంగనా అన్నారు.
అసలు వివాదం ఎలా మొదలైంది?
జనరేషన్ జెడ్‌కు చెందిన కొందరు నిరసనకారులు, యువతపై కంగనా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆమె వ్యాఖ్యలను పలువురు విమర్శించగా.. తాజాగా బాబా రామ్‌దేవ్ కూడా స్పందించారు. ఆయన విమర్శలకు కంగనా ఇచ్చిన వ్యక్తిగత సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కంగనా–రామ్‌దేవ్ మధ్య మొదలైన ఈ మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు Gen Zపై కంగనా వ్యాఖ్యలు.. మరోవైపు ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించిన రామ్‌దేవ్ వ్యాఖ్యలు.. ఇప్పుడు ఈ వివాదాన్ని మరింత వేడెక్కించాయి.
- India Bloc March: ఉద్రిక్తంగా మారిన ఇండియా బ్లాక్ పాదయాత్ర… ‘Gyanesh, it’s done bro’ ప్లకార్డుతో బారికేడ్ పైకి ఎక్కి నిలబడ్డ రాహుల్ గాంధీ…
- ఇండియా బ్లాక్ మార్చ్: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు అదుపులోకి
- Hyderabad Water Crisis: రిజర్వాయర్లు అడుగంటుతున్నాయ్.. హైదరాబాద్‌కు తాగునీటి సంక్షోభం ముంచుకొస్తుందా..?
- Andhra Pradesh: బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం చేసిన కండక్టర్
- Land Pooling Policy: తెలంగాణలో కొత్త ల్యాండ్ పూలింగ్ పాలసీ.. భూయజమానులకు నగదు బదులు డెవలప్డ్ ప్లాట్లు..?